![]() |
![]() |

సంక్రాంతి విన్నర్ గా ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం(Sankrathiki Vasthunnam).ఈ నెల 14 న థియేటర్స్ లో అడుగుపెట్టగా,ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు ఫ్యామిలీలకి ఫ్యామిలీలు థియేటర్స్ దగ్గర క్యూ కడుతున్నారు.దీంతో అన్ని థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి.ఒక ఏరియా అని కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ఇదే పరిస్థితి.
దీంతో అనేక రికార్డులు 'సంక్రాంతికి వస్తున్నాం' పేరిట నమోదువుతున్నాయి అల్లుఅర్జున్(Allu arjun)త్రివిక్రమ్(Trivikram)కాంబోలో వచ్చిన 'అలవైకుంఠ పురంలో' సాధించిన ఘన విజయం అందరకి తెలిసిందే.2020 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంది.లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ గా 163 .17 కోట్ల షేర్ ని రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకి భారీ లాభాలని తెచ్చిపెట్టింది.ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ 145 .24 కోట్ల షేర్ ని సాధించి,'అలవైకుంఠ పురంలో' సాధించిన షేర్ ని బీట్ చెయ్యడానికి సిద్ధంగా ఉంది.దీంతో డిస్ట్రిబ్యూటర్ లు భారీ లాభాలని చవి చూడనున్నారు.ఇంకా మూడు వారాలు కూడా కంప్లీట్ చేసుకొని 'సంక్రాంతికి వస్తున్నాం',లాంగ్ రన్ లో ఎంత మేర కలెక్షన్స్ ని వసులు చేస్తుందనే ఆసక్తి ట్రేడ్ వర్గాలతో పాటు సినీ ప్రియుల్లో కూడా నెలకొని ఉంది.ఇప్పటికే కొన్ని థియేటర్స్ లో బాహుబలి లాంగ్ రన్ కలెక్షన్స్ ని కూడా దాటడం ఈ మూవీ ప్రభంజనానికి నిదర్శనం అనే మాటలు కూడా విన్పడుతున్నాయి.
విక్టరీ వెంకటేష్(Venkatesh)తో పాటు ఐశ్వర్య రాజేష్(AIswarya Rajesj)మీనాక్షి చౌదరి(Meenkashi Chowdhary)పోటాపోటీగా నటించగా, నిర్మాత దిల్ రాజు(Dil Raju)కి చాలా ఏళ్ళ తర్వాత భారీ హిట్ దొరికింది.అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వప్రతిభతో పాటు భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ కూడా ఈ మూవీకి ప్లస్ గా నిలిచింది.

![]() |
![]() |