![]() |
![]() |

టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
బుధవారం చెన్నైలో జరిగిన 'దళపతి 66' మూవీ లాంచ్ వేడుకలో మూవీ టీమ్ టీమ్ పాల్గొంది. విజయ్, రష్మిక లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టారు. ఈరోజు నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. చెన్నైలో జరగనున్న మొదటి షెడ్యూల్ లో ఒక సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం.

డబ్బింగ్ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మొదటి సారి డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. అలాగే హీరోయిన్ రష్మికతో విజయ్ జోడీ కట్టడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. విజయ్ సినిమాకి తమన్ సంగీతం అందించడం ఇదే మొదటిసారి. వంశీ-తమన్ కాంబినేషన్ లో మాత్రం 2010 లో 'బృందావనం' సినిమా వచ్చింది. ఇది మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా.. ఇద్దరి కెరీర్స్ కి బూస్టప్ ఇచ్చింది. మరి 12 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
![]() |
![]() |