![]() |
![]() |
.webp)
ఏప్రిల్ 13 న 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి తన తదుపరి సినిమాని టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ 66వ సినిమాని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
'దళపతి 66'లో విజయ్ సరసన రష్మిక మందన్న సందడి చేయనుంది. ఈరోజు(ఏప్రిల్ 5) రష్మిక పుట్టినరోజు కావడంతో ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పూజా హెగ్డే, కియారా అద్వానీ వంటి పేర్లను పరిశీలించిన మూవీ టీమ్ చివరికి రష్మికకి ఓటేసినట్లు తెలుస్తోంది. విజయ్, రష్మిక జోడీగా నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇటీవల 'పుష్ప ది రైజ్'లో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక.. ఈ మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందట. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో మొదటి షెడ్యూల్ జరుగుబోతోందని సమాచారం.
![]() |
![]() |