![]() |
![]() |

'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. తన గత చిత్రం 'జాక్'తో నిరాశపరిచాడు. త్వరలో 'తెలుసు కదా'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా.. అక్టోబర్ 17న థియేటర్లలో అడుగుపెట్టనుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. (Telusu Kada Teaser)
'కృష్ణ అండ్ హిజ్ లీల' అనే రొమాంటిక్ ఫిల్మ్ తో అప్పట్లో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సిద్ధు. ఇప్పుడు అదే తరహాలో 'తెలుసు కదా'తో థియేటర్లలో సందడి చేయనున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. హీరోయిన్లు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఇద్దరితోనూ సిద్ధు లవ్ ట్రాక్ లు నడుపుతున్నాడు. ఇద్దరితో రొమాన్స్ చేస్తున్నాడు.. ఇద్దరికీ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఇంకో విచిత్రం ఏంటంటే.. ఇద్దరు హీరోయిన్లు ఒకరికొకరికి పరిచయం ఉండి, ఫ్రెండ్స్ లా కనిపిస్తున్నారు. మరి సిద్ధు నడిపిన డబుల్ ట్రాక్ లో సక్సెస్ ట్రాక్ ఎక్కిన లవ్ స్టోరీ ఏదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
టిల్లుగా ఎంత నవ్వించినప్పటికీ హీరోగా సిద్ధుకి ప్లే బాయ్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కి తగ్గట్టుగా 'తెలుసు కదా' టీజర్ సాగింది. మరి ఈ మూవీ సిద్ధుకి మరో హిట్ ఇస్తుందేమో చూడాలి.
![]() |
![]() |