![]() |
![]() |

పాన్ ఇండియా ప్రేక్షకులకి 'విజయదశమి'(Vijaya Dasami)మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా 'కాంతార చాప్టర్ 1'(Kantara chapter 1 )అక్టోబర్ 2 న థియేటర్స్ లో సందడి చేయనుంది. షూటింగ్ సమయంలో కొంత మంది యూనిట్ సభ్యులు చనిపోవడంతో పాటు, ఎన్నోసార్లు షూటింగ్ కి అంతరాయం కలిగింది. అయినా సరే ఎక్కడా నిరాశచెందకుండా, ప్రేక్షకులకి 'కాంతార' ని మించిన అనుభూతి ఇవ్వాలని, చిత్ర యూనిట్ రేయంపగళ్ళు 'చాప్టర్ 1 'ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుంది. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా 'చాప్టర్ 1 'రాక కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోను రికార్డు స్థాయిలో జరుగుతుంది. రీసెంట్ గా తెలుగుకి సంబంధించిన హక్కులని అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ భారీ రేట్ కి సొంతం చేసుకుంది. ఇక ఓటిటి కి సంబంధించిన హక్కుల్ని 'అమెజాన్ ప్రైమ్ వీడియో పొందగా, మేకర్స్ అధికారంగా ప్రకటించారు.ఈ ఓటి టి డీల్ వాల్యూ 125 కోట్లు అనే వార్తలు సౌత్ సినీ పరిశ్రమలో వైరల్ గా మారాయి. పైగా 125 కోట్లు సౌత్ లాంగ్వేజస్ వరకే అని, హిందీ వెర్షన్ డీల్ సపరేట్ అన్నట్టుగా తెలుస్తుంది. పాన్ ఇండియా వ్యాప్తంగా చాప్టర్ 1 కి ఉన్న క్రేజ్ దృష్ట్యానే అమెజాన్ అంత భారీ మొత్తం చెల్లించి హక్కుల్ని పొందిందని తెలుస్తుంది.
ఇక ఈ చిత్రం 'కాంతార' కి సీక్వెల్ గా తెరకెక్కుతున్నా, కాంతార లో జరిగిన కథకి ముందు జరిగిన వాటిని చెప్పబోతున్నారు. కర్ణాటక దక్షిణ ప్రాంతంలోని ఒక పల్లెటూరిలో నివసించే ప్రజలు, భూస్వామ్య దొరల నుంచి తమ భూమిని, సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి తమ ప్రాణాలని సైతం పణంగా పెడతారు. అందులో భాగంగా తమ దైవశక్తి భూత కోలను ఆశ్రయిస్తారు. దీని వెనుక వాళ్ల విశ్వాసం, ఆచారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో చాప్టర్ 1 లో కథ, కథనాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉంది. రిషబ్ శెట్టి(Rishab Shetty)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా రుక్మిణి వసంత్(Rukmini Vasanth)హీరోయిన్. అజనీష్ లోకనాథ్ సంగీతం సారధ్యంలో హోంబళే ఫిల్మ్స్(Hombale Films)సుమారు 125 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. కాంతార 14 కోట్లతో తెరకెక్కింది.
![]() |
![]() |