![]() |
![]() |

'మిడిల్ ఫింగర్' (మధ్య వేలు) చూపిస్తే మీనింగ్ ఏంటనేది ఈతరం యువతకు బాగా తెలుసు. అదొక బూతు కింద లెక్క. ప్రేక్షకులకు ఈజీగా అర్థం కావాలంటే 'టాక్సీవాలా' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పైరసీ చేసినవాళ్లకు విడుదల రోజున మిడిల్ ఫింగర్ చూపించాలని విజయ్ దేవరకొండ కోరాడు. అదీ సంగతి! కన్నడ కుట్టి రష్మిక అయితే చిన్నప్పుడే అలా వేలు చూపించింది. ఆ సంగతి స్వయంగా ఆమె చెప్పింది.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో రష్మిక ఒకరు. కవర్ పేజీపై ఆమె ఫోటో పబ్లిష్ చేసే మ్యాగజైన్లు చాలా ఉంటాయి. అయితే, 2001లో ఒక మ్యాగజైన్ కవర్ పేజీ మీద రష్మిక ఫొటో, అదీ ఆమె చిన్నప్పుడు పబ్లిష్ చేశారంటే నమ్మగలరా? చిన్నతనంలో తొలిసారి ఒక మ్యాగజైన్ కవర్ పేజీకి రష్మిక పోజు ఇచ్చారు. ఆ కవర్ పేజీని ఇప్పటికీ రష్మిక తల్లి భద్రంగా దాచిపెట్టారు. అప్పటి ఫొటోను షేర్ చేయడంతో పాటు సేమ్ టు సేమ్ అలాగే రష్మిక మళ్లీ ఫొటో దిగారు. "ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే 2001 నుంచీ నేను వేలు చూపిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు.
![]() |
![]() |