![]() |
![]() |

"ముఖాన్ని బట్టతో కవర్ చేసుకోవడం వల్ల కరోనా వ్యాధి వ్యాప్తి నెమ్మదిస్తుంది. మాస్క్ లను డాక్టర్లకు వదిలేయండి" అని యంగ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ విజ్ఞప్తి చేశాడు. కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. రోగుల సంఖ్యకు తగ్గట్టు డాక్టర్లు నిరంతరం పని చేయాలంటే వాళ్ళకి ఎక్కువ మాస్కులు అవసరమవుతాయి. వైద్యుల రక్షణపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ప్రజలకు ఈ సూచన చేసి ఉండొచ్చు.
మాస్కుల బదులు కర్ఛీఫ్ వాడమని ఆయన సూచించాడు. "చేతి రుమాలు, స్కార్ఫ్, మీ అమ్మ చున్నీ... ఏదో ఒకటి ఉపయోగించి ముఖాన్ని కవర్ చేసుకోండి. సురక్షితంగా ఉండండి" అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. తను కూడా స్కార్ఫ్ లాంటి క్లాత్‌ను మాస్క్‌లాగా పెట్టుకొని ఫొటోకు పోజిచ్చాడు. మొదటి నుంచి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు ఆయన వివరిస్తూనే ఉన్నాడు.
![]() |
![]() |