![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా చేసిన తొలి సినిమా ‘అ!’. అంతకు ముందు ‘డి ఫర్ దోపిడీ’ చిత్రానికి అతడు సమర్పకుడిగానో, నిర్మాతగానో వ్యవహరించాడు. అయితే... నిర్మాణంలో అతడేమీ భాగస్వామి కాదు. సినిమా అంతా పూర్తయిన తర్వాత నచ్చడంతో స్నేహితుల కోసం పోస్టర్ మీద పేరు వేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. కథ ఎగ్జైట్ చేయడంతో నాని ముందుకొచ్చి నిర్మించిన తొలి సినిమా మాత్రం ‘అ!’. నాని అంతలా ఎగ్జైట్ చేసిన దర్శకుడు ప్రశాంత్‌వర్మ.
నాని మాత్రమే కాదు... కథ నచ్చడంతో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్ పాత్ర నిడివి గురించి ఆలోచించకుండా ముందుకొచ్చి చేశారు. రెజీనా అయితే ఒంటిపై పెద్ద పెద్ద టాటూలు వేయించకున్నారు. హెయిర్ స్టయిల్ స్పెషల్‌గా ట్రై చేశారు. కమర్షియల్ సక్సెస్ గురించి పక్కనపెడితే... ‘అ!’ క్రిటిక్స్ చాలామందికి నచ్చింది. ఇప్పుడు ‘అ!’కి సీక్వెల్ చేయాలని ప్రశాంత్ వర్మ స్ర్కిప్ట్ రెడీ చేశారు. కథ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ఏడాది అవుతోందట. నిర్మాత ఎవరు దొరక్కపోవడంతో సెట్స్ మీదకు వెళ్లడం లేదు.
‘‘ఏడాది క్రితమే ‘అ! 2’ స్ర్కిప్ట్ పూర్తి చేశా. ఆ సినిమా గురించి అడుగుతున్న ప్రతి ఒక్కరికీ, ఆ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న వారందరికీ థ్యాంక్యూ. ‘అ!’ కంటే క్రేజీగా ఉంటుంది. కానీ, సినిమా తీయలేకపోతున్నా. ఎందుకంటే... స్ర్కిప్ట్‌కి సరిపడా క్రేజీనెస్ ఉన్న నిర్మాత దొరకడం లేదు. నన్ను నమ్మండి... నేను చాలా ప్రయత్నించా. అది జరుగుతుంది... జరిగినప్పుడు’’ అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. బహుశా... ‘అ!’ తర్వాత అతడు దర్శకత్వం వహించిన ‘కల్కి’ ప్రభావం ఏమైనా పడుతుందేమో.
![]() |
![]() |