![]() |
![]() |

కెమికల్ ల్యాబ్ లో సైంటిస్టులు ప్రయోగాలు చేస్తూ వారానికో కొత్త మందైనా కనుక్కోంటున్నారో లేదో తెలియదు కానీ.. చిత్రసీమలో మాత్రం ప్రతి దర్శకుడు "క్షీర సాగర మధనం" చేస్తూ రోజుకో కొత్త హీరోయిన్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. ఆ కారణంగా కనీసం అయిదేళ్లు ఉండాల్సిన హీరోయిన్స్ లైఫ్ ఇప్పుడు రెండేళ్ళకి పడిపోయింది. రకుల్ మినహా ఈమధ్య కాలంలో ఏ ఒక్క హీరోయిన్ కూడా సరైన విధంగా నిలదొక్కుకొన్న దాఖలాలు లేవు. అలాంటి పోటీ తరుణంగా లావణ్య త్రిపాఠి వరుస పరాజయాలతో ఉన్న లైఫ్ లైన్స్ అన్నీ పోగొట్టుకుంటూ.. కెరీర్ ను కష్టాల్లో నెట్టుకొంటుంది. "భలే భలే మొగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన" చిత్రాలతో స్టార్ ఫామ్ లోకి వచ్చిన లావణ్యకు "మిస్టర్, రాధ" చిత్రాలు కెరీర్ డేమేజింగ్ మూవీస్ లా తయారయ్యాయి.
ఈ సినిమాల్లో అమ్మడు పెర్ఫ్మార్మెన్స్ విషయం పక్కన పెడితో అందచందాలతోనూ సరిగా ఆకట్టుకోకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్న లావణ్య తన మేనేజర్ ను రెండు మొట్టికాయలు మొట్టి.. స్టోరీ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని, ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కష్టమని ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చిందట. చూద్దాం.. మరి అమ్మాయిగారు చాలా లేట్ గా తీసుకొన్న నిర్ణయం ఆమె కెరీర్ ను ఏమేరకు కాపాడుతుందో!
![]() |
![]() |