![]() |
![]() |

టాలీవుడ్ రకుల్ ప్రీత్ సింగ్ టాప్ హీరోయిన్ ప్లేస్ సంపాదించుకుంది. అటు సీనియర్ హీరోలతో నటిస్తూనే.. మరో పక్క యంగ్ హీరోలతో కూడా నటిస్తూ తన హవా కొనసాగిస్తుంది. అయితే తాను ఈ స్థితిలో ఉండటానికి తన హార్ట్ వర్కే కారణమని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. అంతేకాదు కెరీర్ ప్రారంభించిన మొదట్లో నన్నుకూడా ఐరన్ లెగ్ అనే స్టాంప్ వేశారు.. మూడు పెద్ద సినిమాలు మిస్టర్ పర్‌ఫెక్ట్, ఆటోనగర్ సూర్య, బ్రహ్మోత్సవం కు సైన్ చేసిన తర్వాత తీసేశారంటే ఒక హీరోయిన్‌గా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి అంటూ ఫీల్ అయింది. కానీ మన దగ్గర టాలెంట్ ఉంటే పాత్రలే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి... అప్పట్లో నేను మిస్సయిన ఇద్దరు హీరోలు మహేష్‌బాబు, నాగచైతన్యలతో సినిమాలు చేశాను. ఇంకా ప్రభాస్ ఒక్కడే మిగిలాడు అని చెప్పింది. మరి రకుల్ ఆ కోరిక కూడా త్వరలోనే తీరాలని కోరుకుందాం.
![]() |
![]() |