![]() |
![]() |
.jpg)
ఇండియన్ లెజెండరీ డైరెక్టర్స్‌లో ఒకరిగా చెప్పుకునే మణిరత్నం మూవీ వస్తుంది అంటే అదో క్రేజ్. ఎందుకంటే ఆయన చిత్రాలు అంత రొమాంటిక్‌గా ఉంటాయి మరి. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూసోన్న మణి.. కార్తీ, అదితిరావు హైదరిలతో "కాట్రు వెలియిడై" అనే ప్యూర్ లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో "చెలియా" పేరుతో దీనిని అనువదిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
"నువ్వు నన్ను ప్రేమించిన దానికంటే నేను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తా..నువ్వు ద్వేషించినా ప్రేమిస్తా, నువ్వు ఇష్టపడకపోయినా ప్రేమిస్తా"..అంటూ సాగే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో కార్తీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా..అదితిరావు డాక్టర్‌గా కనిపిస్తున్నారు. ఒక డాక్టర్‌కి, పైలట్‌కి మధ్య నడిచే ప్రేమ చివరికి ఎలా ఎండ్ అవుతుందనేదే కథ. కార్తీ తన రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా కనిపిస్తున్నాడు..ఈ ట్రైలర్‌ని చూస్తుంటే పాత మణిరత్నం చిత్రంలా కాకుండా అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్న మూవీలా కనిపిస్తోంది. ఒకపక్క ఎమోషనల్ డ్రామాతో పాటు దేశభక్తిని మణిరత్నం మిక్స్ చేశాడనుకుంటా. ఏప్రిల్ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
![]() |
![]() |