Home  »  News  »  మూలిగే నక్కపై తాటికాయ వేసిన విజయ్

Updated : Mar 9, 2017

పెళ్లిచూపులు మూవీతో సూపర్‌హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ నటించిన ద్వారక రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సహజంగా సూపర్‌ఫాంలో ఉన్న హీరో నటించిన మూవీపై భారీ అంచనాలుంటాయి.. అలాగే పెళ్లిచూపులు లాంటి సక్సెస్ తర్వాత విజయ్ చేసిన మూవీ కావడంతో ఎలా ఉండబోతుందా అని ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా అలాగే ఆలోచిస్తారు. కాని మార్నింగ్ షో పడిన తర్వాత కాని అసలు మ్యాటర్ బయటకు రాలేదు..ద్వారక ఆశించినంత స్థాయిలో వినోదాన్ని పంచలేకపోయింది. ఓకే పర్వాలేదు అన్న మాట బయటకొచ్చింది.

నెగిటివ్ టాక్ వస్తే ప్రమోషన్ కార్యక్రమాలను హోరెత్తించే మన దర్శకనిర్మాతలు యదావిధిగా ఆ పని చేసేశారు. దీనికి హీరోతో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది. అందరూ సినిమాను ఆహో..ఓహో అన్నారు..కాని హీరో విజయ్ మాత్రం క్షమాపణ చెప్పి ఆశ్చర్యపరిచారు. నేను నా టీమ్ కథను నమ్మి ఎంతో కష్టపడి సినిమా చేశాం. నాకు ఒకటే కోరిక ఒక పది సినిమాలు చేసిన తర్వాత నా వికీపీడియా పేజ్ ఓపెన్ చేసుకుంటే అన్ని సినిమాలు వేటికవే డిఫరెంట్‌గా ఉండాలి అన్నాడు. ఇప్పటి దాకా చేసిన సినిమాలు నాకు బాగా నచ్చాయి.

అయితే ద్వారక కొంతమందికి నచ్చలేదు..వారికి క్షమాపణ చెప్తున్నాను. ఇకపై తప్పకుండా అందరికీ నచ్చే సినిమాలు చేస్తాను అన్నాడు. ఈ స్టేట్‌మెంట్‌తో నిర్మాతలు అదిరిపడ్డారు. హీరో అయ్యుండి సినిమాను చూడమని చెప్పాల్సింది పోయి ఇలా చెబుతున్నాడేంటా అని ఆశ్చర్యపోయారు. అయితే ఈ స్టేట్‌మెంట్ జనాల్లో నెగిటీవ్ పబ్లిసిటీని తీసుకువచ్చింది. దీంతో ద్వారకకు ఆడియన్స్ కరువుయ్యారు. ఈ పరిణామంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టైంది ద్వారక నిర్మాతల పరిస్థితి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.