![]() |
![]() |
.jpg)
చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల మెగా మల్టీస్టారర్ కోసం రోజుకో వార్త వినిపిస్తోంది. మెగా అభిమానుల్ని సంతోష పెడుతోంది. చిరు, పవన్‌లు కలసి నటిస్తారని, ఆ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారన్న న్యూస్‌ని ముందు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ... చిరు, పవన్‌లను కలిపే ప్రయత్నంలో నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి వేసిన ఫాస్ట్ స్టెప్పులు ఈ కాంబినేషన్ పై నమ్మకం కుదిరేలా చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతోంది? త్రివిక్రమ్ ఎలాంటి కథతో రాబోతున్నాడు? అనే ఆసక్తి నెలకొంది.
చిరు, పవన్‌లను ఒప్పించి ఈ కాంబినేషన్‌ని సెట్ చేయడం కోసం సుబ్బరామిరెడ్డి ఎంత కష్టపడ్డాడో తెలీదు గానీ.. ఇప్పుడు వీరిద్దరికీ సరిపడా కథ రాయడానికి నిజంగా త్రివిక్రమ్ చాలా కష్టపడాలి. ఎందుకంటే ఇద్దరి ఇమేజ్‌లను మ్యాచ్ చేస్తూ.. తన స్టైల్‌ని మిస్ అవ్వకుండా కథ రాసుకోవడం త్రివిక్రమ్‌కి కత్తి మీద సామే. పవన్‌తో త్రివిక్రమ్‌కి మంచి రాపో ఉంది. పవన్‌కి ఎలాంటి కథలు సెట్ అవుతాయో తనకు బాగా తెలుసు.
చిరంజీవిది అంతా మాస్ ఇమేజే. ఇన్నేళ్ల తరవాత రీ ఎంట్రీ ఇస్తూ.. మాస్ కథనే ఎంచుకొన్నాడు. చిరు కోసమైనా త్రివిక్రమ్ మాస్ కథ రాసుకొంటాడా? లేదంటే అత్తారింటికి దారేది తరహాలో ఫ్యామిలీ డ్రామా వైపు మళ్లుతాడా?? మెగా బ్రదర్స్‌ని తెరపై కూడా అన్నదమ్ములుగా చూపిస్తాడా? లేదంటే వాళ్ల పాత్రల్ని స్నేహితులుగా మలుస్తాడా? అనే విషయంపై మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. అయితే త్రివిక్రమ్ ఇప్పటికే ఓ లైన్ సిద్ధం చేశాడని, అది చిరు, పవన్‌లకు బాగా నచ్చిందని టాక్. సో... ఈ మెగా బ్రదర్స్ కోసం కథ వండడం మొదలైపోయిందన్నమాట.
![]() |
![]() |