![]() |
![]() |

ఇటీవల కాలంలో టాలీవుడ్‌కి తగిలిన అతి పెద్ద షాక్... చిరు, పవన్‌ల మెగా మల్టీస్టారర్. ఈ కాంబినేషన్లో సినిమా రాదు.. అనుకొంటున్న తరుణంలో చిరు, పవన్‌లతో ఓ సినిమా సెట్ చేయడం అంతా టి.సుబ్బరామిరెడ్డి తెలివితేటలకు నిదర్శనం. చిరుతో టి.సుబ్బరామిరెడ్డి సినిమా తీయడంలో ఎలాంటి వింతా లేదు. ఎందుకంటే వాళ్లిద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది. కానీ... అది మెగా మల్టీస్టారర్ కావడం మాత్రం కచ్చితంగా సుబ్బరామిరెడ్డి ఘనతే! ఈ సినిమా సెట్ అవ్వడం వెనుక చాలా చాలా కారణాలున్నాయి.
చిరుకి సుబ్బరామిరెడ్డిపై ఉన్న గౌరవం కూడా ఓ కారణం! పైగా చాలా సార్లు, చాలా రకాలుగా చిరు వెనుక నిలబడిన వ్యక్తి సుబ్బరామిరెడ్డి. చిరుకి అప్పట్లో పద్మభూషణ్ అవార్డు రావడం వెనుక సుబ్బరామిరెడ్డి సిఫార్సులు చాలానే పనిచేశాయని సినీ జనాలు ఇప్పటికీ చెప్పుకొంటూనే ఉన్నారు. సో... ఇప్పుడు ఆ రుణం చిరు తీర్చుకొంటున్నాడన్నమాట. మరో నిర్మాత పవన్ - చిరుల సినిమా చేద్దామని ముందుకొస్తే చిరు కచ్చితంగా నో చెప్పేవాడేమో. సుబ్బరామిరెడ్డి కాబట్టి.. ఆయన మాటకు విలువ ఇచ్చాడు. అదీ.. ఈ కాంబో వెనుక ఉన్న అసలు కథ.
![]() |
![]() |