![]() |
![]() |

సుమారు తొమ్మిది సంవత్సారాల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఖైదీ. నెంబర్.150. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 70% పూర్తి కావొచ్చింది. అయినప్పటికి సినిమాలో నటీనటులు ఎలా ఉన్నారా అని తెలిపే ఒక్క పిక్ కూడా బయటకు రావడం లేదు. మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవి సెటిల్‌మెంట్ చేస్తున్నట్లుగా వచ్చిన ఫోటో బయటకు రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. మళ్లీ ఆ తర్వాత ఖైదీ నెం.150 నుంచి ఎలాంటి పిక్స్ బయటకు రాలేదు. తాజాగా ఈ సినిమాలో విలన్‌గా నటిస్తోన్న తరుణ్ అరోరాకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. షూటింగ్ సమయంలో తన డైలాగ్స్‌ను బట్టిపడుతున్నట్లుగా ఉన్న తరుణ్ స్టైలిష్ లుక్‌లో మెగాస్టార్‌కు ధీటుగా కనిపిస్తున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే సినిమాలో ఎలా రఫ్పాడించి ఉంటాడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
![]() |
![]() |