![]() |
![]() |

జనతా గ్యారేజ్ చూసినోళ్లంతా 'ఇది అద్భుతం.. సూపర్ హిట్... బ్లాక్ బస్టర్' అనేం అనడం లేదు. ఓకే ఓకే సినిమా అంటున్నారంతే! ఎన్టీఆర్ గత సినిమాల కంటే కాస్త బెటర్‌గా... కొరటాల బ్లాక్ బస్టర్లకంటే తక్కువగా ఉంది రిజల్ట్. వరుసగా సెలవలు రావడం జనతాకు కలిసొచ్చిన విషయం. అంతమాత్రాన ఈ సినిమాకి ఊహించని విధంగా లాభాలొచ్చేశాయి అని చెప్పలేం. మరి ఆ లెక్కలేమిటి? జనతా గ్యారేజ్ వల్ల బాగుపడింది ఎవరు? ఈ విషయాల గురించి లోతుగా ఆలోచిస్తే... కొన్ని నమ్మలేని నిజాలు బయపడతాయి.
జనతా గ్యారేజ్‌కి రూ.50 కోట్లొచ్చాయి... రూ.60 కోట్లొచ్చాయి అని గొప్పగా చెప్పుకొంటోంది చిత్రబృందం. అసలు లెక్కల్లోకి వెళ్తే.. జనతా బడ్జెట్ రూ.55 కోట్ల పైచిలుకు. ఈ సినిమా నిర్మాతలు భారీ లాభాలకు అమ్ముకొన్నారు. ఒక్కో నిర్మాతకూ ఎంతకాదన్నా... రూ.5 కోట్లయినా లాభం వచ్చింది. ఎన్టీఆర్, కొరటాలకు చెరో పది కోట్ల వరకూ దక్కాయి. ఈ సినిమా వల్ల బాగుపడిందెవరైనా ఉన్నారంటే ఇది వీళ్లే. మరి సినిమాని కొన్న బయ్యర్లు ఏమైపోవాలి? ఈ సినిమాని భారీ రేట్లకు కొన్న బయ్యర్ కూడా బాగుపడాలంటే.. జనతా గ్యారేజ్ టోటల్ గా రూ.80కోట్లు వసూలు చేయాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది సాధ్యమయ్యే విషయం అనిపించడం లేదు. జనతా గ్యారేజ్‌ని నైజాంలో దిల్ రాజు రూ.16కోట్లకు కొన్నాడు. ఖర్చులు, వడ్డీలతో కలపి అది రూ.18 కోట్ల వరకూ అయ్యింది. ఇప్పటికి ఈ సినిమాకి నైజాంలో రూ.14 కోట్లు వచ్చాయని చిత్రబృందం లెక్కగట్టింది. ఆ లెక్కలే నిజమనుకొన్నా... ఈ సినిమాకి ఇంకా రూ.4 కోట్లు రావాలి.
సోమవారం వరకూ వసూళ్లు బాగానే ఉన్నా.. మంగళవారం పూర్తిగా డ్రాప్ అయ్యాయి. థియేటర్లో 30 శాతం టికెట్లు కూడా సరిపోవు. ఇప్పుడొచ్చే కలక్షన్లు మొత్తం అద్దెలకే సరిపోతాయి. అలాంటప్పుడు రూ.4 కోట్లు రాబట్టుకోవడం అసాధ్యం. నైజాం అనే కాదు.. దాదాపు ప్రతి ఏరియాలోనూ ఇదే పరిస్థితి. కాకపోతే ఏ బయ్యరూ బయటకు చెప్పుకోడంతే! సినిమా తీసిన వాడికీ, కొన్నవాడికీ ఓ రూపాయి వచ్చినప్పుడే అది హిట్ సినిమా అనుకొంటే.. జనతా గ్యారేజ్ ఎక్కడ ఉందో మీరే ఆలోచించుకోండి.
![]() |
![]() |