Home

»

Latest News

నానితో మళయాళీ ముద్దుగుమ్మలు

Sep 6, 2016 4:26PM

ఒక నటుడు తన కెరిర్‌లో ఒకే హీరోయిన్‌తో ఎక్కువ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుని ఉండొచ్చు. కాని ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వేర్వేరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాల్లో నటిస్తే..ఆ హీరో ఎవరో కాదు సహజమైన నటనతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన నేచురల్ స్టార్ నాని. అతనిలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే..నాని చేసిన ప్రతి సినిమాలో కొత్త కొత్త హీరోయిన్లని పరిచయం చేయడమే. అందులోనూ మళయాళీ ముద్దుగుమ్మలకే నాని ఓటు వేస్తున్నాడు. అలా మొదలైంది మొదలు రిలీజ్‌కు రెడీగా ఉన్న మజ్ను వరకు నాని పక్కన మెరిసిన వాళ్లంతా మళయాళీలే. ఇలా నేచురల్ స్టార్ పరిచయం చేసిన వారంతా తెలుగు పరిశ్రమలో పలు అవకాశాలను అందుకుని బిజి హీరోయిన్లుగా మారిపోతున్నారు. అటు నాని కూడా తన సినిమాలతో పరిచయం అవుతున్న హీరోయిన్లంతా ఓ వెలుగు వెలుగుతుంటూ..ఆనందంగా ఉందని గర్వంగా చెప్పాడు. 
 

నానితో జత కట్టిన మళయాళీలు వీరే..

1. అలా మొదలైంది:- నిత్యామీనన్

 

2. భీమిలి కబడ్డీ జట్టు: శరణ్యమోహన్

 

3. పైసా:- కేథరిన్ 

 

4. జెండాపై కపిరాజు: అమలాపాల్

 

5.ఎవడే సుబ్రమణ్యం:- మాళవికా నాయర్

 

 

6. జెంటిల్ మెన్:- నివేధా థామస్

 

7. మజ్ను:- అను ఇమాన్యుయేల్

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com