Home  »  News  »  కారణం ఇదే 

Updated : Aug 26, 2026

 


'ప్రేమ ఇష్క్ కాదల్' (2013), 'సావిత్రి' (2016), 'సేనాపతి' (2021) వంటి వైవిధ్యమైన సినిమాలతో పాటు 'పిల్లా', 'ఈ ఆఫీస్‌లో', 'దయ్యా' (2023) వంటి హిట్ వెబ్ సిరీస్‌లను తెరకెక్కించి టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు పవన్ సాదినేని. ప్రస్తుతం  దుల్కర్ సల్మాన్ తో  'ఆకాశంలో ఒక తార' చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం పవన్ పై  ఒక నటి చేసిన తీవ్రమైన లైంగిక వేధింపులు, మోసం ఆరోపణల నేపథ్యంలో పోలీసుల అదుపులోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.  


పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం, సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను నమ్మించి, వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి సుదీర్ఘకాలం పాటు తనతో సహజీవనం చేశాడని, అనంతరం తనను మోసం చేసి లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలైన సదరు నటి తీవ్ర స్థాయిలో ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా అవసరం తీరిపోయాక ముఖం చాటేశాడని సదరు ఆర్టిస్ట్ తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి పవన్ ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  

Also Read: Toxic: నెగిటివ్ టాక్పై ఫ్యాన్స్ ఫైర్

సినిమా పరిశ్రమలో 10 ఏళ్లకు పైగా కెరీర్ ఉన్న ఒక పేరున్న దర్శకుడిపై ఇలాంటి తీవ్రమైన కేసులు నమోదు కావడం, అది కూడా నేరుగా అరెస్టే కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే 'ఆకాశంలో ఒక తార' ప్రాజెక్ట్ కీలక దశలో ఉండగా, గతంలో కూడా ఈ సినిమాకు చెందిన కాస్టింగ్ ప్రాసెస్ సందర్భంగా తొంబై వేల రూపాయల బకాయిల చెల్లింపు విషయంలో నటిపై వేధింపుల వివాదం బయటకు వచ్చింది. . ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరిస్తూ తదుపరి విచారణను వేగవంతం చేశారు. ఈ అరెస్ట్ వార్త టాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.   

Pavan Sadineni, Tollywood 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.