![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. తండ్రి-కూతుళ్ళ ఎమోషన్, అయ్యప్ప భక్తి నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 21న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. చాలా చోట్లా టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. షోలు పెంచాలన్న డిమాండ్ కూడా ఉంది. ప్రస్తుత జోరు చూస్తుంటే రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టడం ఖాయమని.. అన్నీ కలిసొస్తే ఆ నెంబర్ రూ.200-300 కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ‘ఇరుముడి’ సినిమాకి అతిపెద్ద సవాల్ ఎదురుకాబోతుంది.
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ ఆగష్టు 26న థియేటర్లలోకి వస్తోంది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ‘టాక్సిక్’ రిలీజ్ అవుతుండటంతో.. ‘ఇరుముడి’ థియేటర్ల కౌంట్, కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
'కేజీఎఫ్' తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'టాక్సిక్'పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా, ఈ మూవీ తెలుగు రైట్స్ ను దిల్ రాజు ఏకంగా రూ.120 కోట్లకు దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాల మాట. ఆ మొత్తం రాబట్టుకోవడానికి తెలుగునాట భారీ విడుదల ఉంటుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా తెలంగాణలో ఫస్ట్ డే దాదాపు 80 శాతం సింగిల్ స్క్రీన్స్ 'టాక్సిక్' వెళ్లనున్నాయి అంటున్నారు.
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ‘ఇరుముడి’ సునామీ కనిపిస్తోంది. చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలని, ఇంకా చూడని వాళ్ళు ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక వారం కూడా పూర్తి కాకుండానే.. కావాల్సినన్ని థియేటర్లు లేకపోవడం అనేది పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
అయితే ఇక్కడ ‘ఇరుముడి’కి కలిసొచ్చే కొన్ని అంశాలు ఉన్నాయి. టాక్సిక్ అనేది మితిమీరిన వయలెన్స్ తో కూడిన బోల్డ్ మూవీ. దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లే పరిస్థితి దాదాపు ఉండదు. పైగా ఇప్పుడు తెలుగునాట 'టాక్సిక్' నిలబడాలంటే.. ఇరుముడిని మించిన గొప్ప టాక్ రావాలి. అప్పుడే యూత్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
‘టాక్సిక్’కి ఓ రేంజ్ టాక్ రాకపోయినా, జనరల్ ఆడియన్స్ సపోర్ట్ లేకపోయినా నిలబడటం కష్టమే. ఒకవేళ అదే జరిగి, ఆడియన్స్ రాకపోతే.. రెండు రోజు నుంచే థియేటర్లు తగ్గుతూ, ఆటోమేటిక్ గా ఇరుముడికి వస్తాయి. అదే జరిగితే ఇరుముడి ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదు. మరి తెలుగు ఆడియన్స్ 'టాక్సిక్' రూపంలో ఎదురుకానున్న సవాల్ ను ఎదుర్కొని, ‘ఇరుముడి’ని పల్లకిలా భుజాన మోస్తారేమో చూడాలి.
Irumudi vs Toxic, Irumudi Collections, Ravi Teja, Irumudi Movie, Toxic Movie
![]() |
![]() |