Home

»

Latest News

NBK111 రిలీజ్ డేట్: బాలయ్య బాక్సాఫీస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.!

Aug 24, 2026 10:45AM

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ 'NBK111'. కాకినాడ పోర్ట్ షూటింగ్‌లో బాలకృష్ణ మోకాలికి గాయం కావడంతో షూటింగ్ ఆలస్యమై దసరా విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు బాలయ్య షూటింగ్ కి రెడీ అవుతుండటంతో.. కొత్త రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది.

వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దసరా కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ, బాలకృష్ణ మోకాలికి సర్జరీ జరగడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది.

అయితే, గాయం నుంచి కోలుకుంటున్న బాలయ్య సెప్టెంబర్ నుంచే మళ్ళీ ఫుల్ ఫిట్‌నెస్‌తో లొకేషన్‌లోకి అడుగుపెట్టబోతున్నారట. గోపీచంద్ మలినేని ఆల్రెడీ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసి, మిగిలిన బ్యాలెన్స్ పార్ట్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం.

దసరా రేసు నుంచి తప్పుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేయడానికి మేకర్స్ ఒక పర్ఫెక్ట్ డేట్‌ను సెట్ చేశారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ హాలిడే సీజన్, ఇయర్ ఎండ్ వీకెండ్ అడ్వాంటేజ్ తోడైతే బాలయ్య బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మంచు మనోజ్ ఒక కీలకమైన పాత్రలో మెరవనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర టైటిల్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

 

 

 

 

NBK111 Release Date, Nandamuri Balakrishna, Gopichand Malineni, Kajal Aggarwal, Manchu Manoj

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com