Home  »  News  »  భార్యకి అడ్డంగా దొరికిపోయిన హీరో.. వేరే మహిళతో గదిలో!

Updated : Aug 19, 2026

 

'బాసింగ బలాలు' వంటి సూపర్ హిట్ జానపద గీతంలో తన అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి. ఎంతోమంది అభిమానులని  అలరించిన ఈ జానపద కళాకారుడి నిజస్వరూపం మరియు రాసలీలల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈశ్వర్ సాయి భార్య పేరు శరణ్య.   గత కొన్ని రోజులుగా ఆమెకి  భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చింది.ఈశ్వర్ సాయి మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌తో వేములవాడలోని రెడ్డి భవన్‌ లో  ఉన్నాడనే సమాచారంతో  తన బంధువులతో కలిసి అక్కడికి చేరుకుంది.ఈశ్వర్ సాయి, ఫోక్ ఆర్టిస్ట్‌ గదిలో ఉన్నారు. దీంతో  వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ శరణ్య  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.


Also read: బ్రహ్మానందంపై అన్నయ్య వదన్ సంచలన వ్యాఖ్యలు 


.బాసింగ బలాలు  ఈ పాటలో ఈశ్వర్ సాయితో పాటు వైష్ణవి సోనీ నటించగా, యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించి పెళ్లిళ్లు, డీజే ఈవెంట్లలో మారుమోగిపోయింది. ఈశ్వర్ సాయి గతంలో ''మాధురి రాథోడ్'' అనే ఫోక్ ఆర్టిస్ట్‌తో కలిసి ‘రాతిరి రాతిరి రాతిరిలో’, ‘ప్రమీల’ వంటి పలు హిట్ జానపద గీతాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పరంగా వరుస హిట్ పాటలతో దూసుకుపోతున్న సమయంలో ఈశ్వర్ సాయి కుటుంబ వివాదంతో వార్తల్లో నిలవడం ఆయన అభిమానులని  ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

Eshwar Sai, Tollywood






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.