Home  »  News  »  'ఇరుముడి'లో రామ్ చరణ్?.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్ శివ నిర్వాణ.!

Updated : Aug 19, 2026

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న 'ఇరుముడి' సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యామియో రోల్‌లో కనిపించబోతున్నారంటూ నెట్టింట ఒక రేంజ్ వార్తలు వైరల్ అయ్యాయి. 'మల్లెపూల పల్లకి' పాటలో చరణ్ గ్రాండ్ ఎంట్రీ ఉండబోతోందంటూ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలు ఈ ప్రచారంపై తాజాగా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.

రామ్ చరణ్ ప్రతి ఏటా ఎంతో నిష్టగా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. ఆయనలోని ఆ దైవభక్తి, ఆ ఆధ్యాత్మిక వైబ్స్ అందరికీ తెలిసిందే. మరోవైపు 'ఇరుముడి' సినిమా కూడా అయ్యప్ప స్వామి దీక్ష, ఆ పవిత్రమైన మాల నేపథ్యంతో ముడిపడి ఉంది. దాంతో అభిమానులు ఈ సినిమాలో రామ్ చరణ్‌ను కూడా చూస్తే బాగుంటుందని ఊహించుకుని, ఆయనే క్యామియో ఇస్తున్నారంటూ రూమర్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు.

ఈ వార్తలపై దర్శకుడు శివ నిర్వాణ స్పందిస్తూ... "రామ్ చరణ్ గారు 'ఇరుముడి' సినిమాలో కనిపిస్తారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు" అని చెప్పారు. "రామ్ చరణ్ గారు గొప్ప అయ్యప్ప భక్తుడు. ఆయనలో ఉన్న ఆ డివైన్ వైబ్స్ వల్ల అభిమానులు ఆయన్ని ఈ సినిమాలో చూడాలని ఆశపడి ఉండవచ్చు, అందుకే ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ చరణ్ గారు ఈ సినిమాలో నటించడం లేదు.. అయితే మా సినిమాను చరణ్ గారు చూసి మెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని శివ నిర్వాణ వెల్లడించారు.

ఇక సినిమా విషయానికొస్తే.. ఈ ఆగష్టు 21న విడుదల కాబోతున్న 'ఇరుముడి' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అయ్యప్ప స్వామి మాల, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు ఒక థ్రిల్లింగ్ క్రైమ్ యాంగిల్... ఇలా మూడు లేయర్స్‌లో కథ అద్భుతంగా సాగుతుందని చెప్పారు. "ఒక స్టార్ హీరో అయ్యప్ప మాలలో క్రైమ్ అండ్ ఫ్యామిలీ కథ చేస్తే ఆ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో థియేటర్లలో చూస్తారు. ఈ సినిమా కథ కోసమే నేను కూడా స్వయంగా అయ్యప్ప మాల ధరించాను" అని శివ నిర్వాణ తెలిపారు.

 

 

 

Ram Charan, Irumudi Movie, Ravi Teja, Shiva Nirvana

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.