Home  »  News  »  అదరగొడుతున్న హుషారు పిట్టలు కలెక్షన్స్..  త్రీ డేస్ లెక్క ఇదే!

Updated : Aug 17, 2026


హుషార్ పిట్టలు.. టైటిల్ కి తగ్గట్టే బాక్స్ ఆఫీస్ వద్ద యమ హుషారుగా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. ఎటువంటి స్టార్ స్టేటస్  లేకపోయినా కంటెంట్ పవర్ ఉంటే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో కూడా నిరూపించింది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఆగస్టు 15న రిలీజైన హుషార్  పిట్టలు బాక్సాఫీస్ దగ్గర ఊహించని రేంజ్ వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

విడుదలైన మొదటి రోజు నుంచే హౌస్‌ఫుల్ బోర్డులతో సందడి చేస్తూ మూడు రోజులకి 1 . .94 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఊహించని రెస్పాన్స్ చూసి ఎగ్జిబిటర్లు సైతం థియేటర్ల సంఖ్యను భారీగా పెంచుతున్నారంటే ఈ బొమ్మ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే, థియేటర్ల బయట, లోపల కనిపిస్తున్న రచ్చ మాత్రం కాస్త వివాదాస్పదంగా మారింది. సినిమాలో యూత్‌ఫుల్ కంటెంట్, టీనేజ్ లవ్ , రొమాంటిక్ సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉండటంతో  కుటుంబ సమేతంగా వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ ని  థియేటర్ యజమానులు లోపలికి అనుమతించడం లేదు. హైదరాబాద్ లోనే ఈ పరిస్థితి ఉందంటే మిగతా ఏరియాస్ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.


Also read: అగధ మూడు రోజుల కలెక్షన్స్ ఇవే! 


 టీనేజ్ వయసులోని ఆకర్షణ, స్మార్ట్‌ఫోన్‌లు, అశ్లీల వీడియోల ప్రభావం పిల్లల జీవితాలను ఎలా దారితప్పిస్తుందో సందేశాత్మకంగా విశ్లేషించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో రవి (అన్హు), చిట్టి (వాసవి గణేషన్) పాత్రల మధ్య సాగే అమాయకత్వంతో కూడిన టీనేజ్ రొమాన్స్, మోహం, ఆ తర్వాత వారు ఎదుర్కొనే పర్యవసానాలను చాలా బోల్డ్‌గా చూపించారు. మొదటి భాగం అంతా యూత్‌ను ఆకట్టుకునే ఫన్, బోల్డ్ కంటెంట్‌తో సాగితే, సెకండాఫ్ మాత్రం తల్లిదండ్రులకు, నేటి సమాజానికి కళ్ళు తెరిపించే భావోద్వేగమైన సందేశాన్ని ఇస్తుంది.  సినిమాలో బోల్డ్ సీన్స్ హద్దులు దాటాయనే విమర్శలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురుస్తోంది. స్టార్ కాస్ట్ లేకపోయినా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే పెద్ద సినిమాల పోటీ నడుమ ఈ చిత్రాన్ని ధైర్యంగా రిలీజ్ చేశామని, ప్రేక్షకులు ఆదరించి పెద్ద హిట్ చేశారని నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి లాంగ్ రన్ లో ఏ మేర కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.  బిక్షు దర్శకుడు.

 Husharu Pittalu, Suresh Productions

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.