![]() |
![]() |

అభిమానులు, ప్రేక్షకులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'రాకా' కోసం ఎంతో రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబయ్‌లో షూటింగ్ జరుపుకుంటుండగా భారతీయ సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా అతిపెద్ద కాస్టింగ్‌తో రాకా తెరకెక్కబోతుందనే ప్రచారం ఇండియన్ సినీ సర్కిల్స్ లో చాలా కాన్ఫిడెన్స్ గానే చక్కర్లు కొడుతుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో గ్లామరస్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు సమాచారం. ఒక శక్తివంతమైన గిరిజన రాణి (Tribal Queen ) గా కనిపించబోతున్నట్లు కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం పేరుకే గ్లామర్ కోసమో లేదా చిన్న అతిథి పాత్ర కోసమో కాకుండా, మొత్తం కథను సరికొత్త మలుపు తిప్పే అత్యంత కీలకమైన డ్రామాతో కూడిన రోల్ అని .ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్, మోడరన్ పాత్రల్లోనే అలరించిన జాన్వీ కపూర్, 'రాకా' సినిమాలో మునుపెన్నడూ చూడని 'రా అండ్ రస్టిక్' (Raw & Rustic) లుక్‌లో కనిపించి అందరినీ మెప్పించనుందట. అడవి నేపథ్యంలో జరిగే సన్నివేశాల్లో ఆమె ఊరమాస్ నటనతో మెస్మరైజ్ చేయడం ఖాయం అని కూడా అంటున్నారు.
Also Read: జ్ఞాపకశక్తి కోల్పోయిన ప్రముఖ #హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్
మరి ఈ న్యూస్ నిజమైతే జాన్వీ కపూర్ పెద్ది తర్వాత తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కనిపించే మూవీ రాకా నే అవుతుంది. అదే విధంగా తన కెరీర్ కి మంచి బూస్టప్ ఖాయం. దీపికా పదుకునే ఆల్రెడీ రాకా లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. దీపికాతో పాటు మొత్తం ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం జరుగుతుండగా రష్మిక పేరు కూడా వినిపిస్తుంది.
Raaka, Allu Arjun, Janhvi Kapoor, Deepika Padukone

,
![]() |
![]() |