Home  »  News  »  బాసు.. ఈ రోజు ఆ సీక్రెట్ చెప్పేస్తావా!

Updated : Aug 11, 2026

 

మెగాస్టార్ చిరంజీవి వన్ మాన్ మ్యాజిక్ మన శంకర వరప్రసాద్ గారు ఘన విజయం సాధించినా, అభిమానుల మనస్సులో ఆ మూవీ చూస్తున్నా  విశ్వంభర గురించి ఆలోచనే ఉంది. 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'అంజి' వంటి ఆల్ టైమ్ క్లాసిక్ సోషియో-ఫాంటసీ చిత్రాల తర్వాత, చిరంజీవి నుంచి వస్తున్న  అత్యంత ప్రతిష్టాత్మక భారీ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ  కావడంతో 'విశ్వంభర'   కోసం ఎదురుచూడని అభిమాని, సినీ ప్రేమికుడు లేడు. పైగా మన శంకర వరప్రసాద్ గారు కంటే ముందు స్టార్ట్ అయిన మూవీ. కానీ చాలా రోజుల నుంచి  ఈ భారీ ప్రాజెక్ట్‌ గురించి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు.   

అలాంటిది ఈ రోజు చిరంజీవి తన సోదరుడు కుమారుడు వరుణ్ తేజ్ నుంచి వచ్చిన కొరియన్ కనకరాజు హిట్ అవ్వడంతో హైదరాబాద్ లోని ఒక హోటల్ లో జరిగే సక్సెస్ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిధిగా హాజరవుతున్నాడు. దీంతో విశ్వంభర గురించి మాట్లాడతాడనే చర్చ జరుగుతుంది. చర్చ జరగడానికి కారణం కూడా లేకపోలేదు. విశ్వంభర ని నిర్మించింది కొరియన్ కనకరాజు ని నిర్మించిన యు వి క్రియేషన్స్ నే. విశ్వంభరలో  మెగాస్టార్  ఆధ్యాత్మిక భావనలు కలిగిన హనుమాన్ భక్తుడి పాత్రలో కనిపిస్తుండటం విశేషం.

 

హీరోగా ఆయన పవర్ ఫుల్ ప్రెజెన్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడి ఉన్న యాక్షన్ సీక్వెన్సులు థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ అనుభూతిని అందించబోతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథను ఎంత రిచ్‌గా, గ్రాండ్‌గా చూపించవచ్చో ఆలోచించిన నిర్మాతలు, సినిమా కోసం ఏకంగా 13 భారీ సెట్లను ప్రత్యేకంగా నిర్మించి ఓ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు.  ఈ భారీ సెట్లలో చిత్రీకరించిన సన్నివేశాలు, గ్రాఫిక్స్ హంగులు సోషియో ఫాంటసీ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకోనున్నాయి. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు సమకూరుస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని  మరో స్థాయికి తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉంటాయని కీరవాణి ఇప్పటికే స్పష్టం చేశారు. అందులో ఒక పవర్‌ఫుల్ ఇంట్రో సాంగ్‌తో పాటు ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పెషల్ సాంగ్ కూడా ఉంది.

Also read: వైరల్: #అల్లు అర్జున్ పై మమితా బైజు కీలక వ్యాఖ్యలు..  డైహార్డ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో

ఈ భారీ ప్రాజెక్ట్‌లో చిరంజీవికి జోడీగా సీనియర్ నటి, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తుండగా, మరో కీలక రోల్ లో ఆషికా రంగనాథ్ అలరించనున్నారు.మొత్తం 5 గురు కథానాయికలు కనిపించనున్నారని ఫిలింనగర్ సమాచారం. అలాగే ప్రతినాయకుడి పాత్రలో కునాల్ కపూర్ నటిస్తూ సినిమాకు మరింత డ్రామాను జోడిస్తున్నారు. చిత్రీకరణ పరంగా ఇప్పటికే దాదాపు అన్ని టాకీ పార్ట్‌లు పూర్తయిపోయాయి. కేవలం 2 పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.

అయితే విడుదల తేదీ చుట్టూ నడుస్తున్న చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మొదట ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా లేదా వేసవి రేసులో విడుదల చేయాలని భావించినప్పటికీ, రెండో భాగంలో ఉండే అత్యంత ప్రతిష్టాత్మకమైన సీజీ (CG) మరియు వీఎఫ్‌ఎక్స్ (VFX) పనులు అత్యంత నాణ్యతతో రావడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.అత్యుత్తమ విజువల్ క్వాలిటీ కోసం మేకర్స్ రాజీ పడకుండా పనిచేస్తున్నారు. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ సాధించడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ టీమ్‌లు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. పండుగ సీజన్ దసరా లేదా ఈ ఏడాది చివర్లో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బింబి సార ఫేమ్ వశిష్ట దర్శకుడు 

Chiranjeevi, VishwamBhara, Korean kanakaraju, Varun Tej 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.