![]() |
![]() |

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా తనదైన ముద్ర వేసిన మౌళి.. '90s' వెబ్ సిరీస్ తో నటుడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 'లిటిల్ హార్ట్స్'తో వెండితెర ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు.
మౌళి తన రెండో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేస్తున్నాడు. శ్రీను కంబాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు 'దొంగ నా కొడుకు' అనే టైటిల్ పెట్టడం విశేషం. రాబరీ క్రైమ్ కామెడీగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. పేక ముక్కను చీల్చుకుంటూ బ్యాగ్ పట్టుకొని పరుగెత్తుతున్నటుగా ఉన్న మౌళి లుక్ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన మౌళి.. "ఈసారి కామెడీతో పాటు చాలా ట్విస్ట్స్ కూడా. టైటిల్ కొంచెం కమర్షియల్ గా అనిపించొచ్చు.. కానీ నన్ను నమ్మండి, సినిమాలో చాలా కంటెంట్ ఉంది." అని ట్వీట్ చేశాడు.
https://x.com/Mouli_Talks/status/2084228095515717804
Mouli, Donga Naa Koduku, First Look, Mythri Movie Makers
![]() |
![]() |