Home  »  News  »  వైరల్ గా మారిన అన్నా కొణిదెల తాజా న్యూస్.. అభిమానులు హర్షాతిరేకాలు 

Updated : Jul 18, 2026


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి అన్ని విధాలుగా కొండంత అండగా ఉంటు అభిమానుల నిత్య నామ స్మరణలో ఒకరిగా మారారు అన్నాకొణిదెల(Anna Konidela). ఇటీవల సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ అయిన అన్నాకి సంబంధించిన తాజా న్యూస్ వైరల్ గా మారింది. 

ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ లో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే.శస్త్రచికిత్స ముగిసిన తర్వాత  హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తన భర్త పవన్ కళ్యాణ్ ఈ శస్త్రచికిత్స నుంచి పూర్తి ఆరోగ్యంతో  కోలుకోవాలని కోరుకుంటూ అన్నా లెజినోవా  కలియుగ దైవం, ఆపద మొక్కుల వాడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి చెంతకు కాలినడకన బయలుదేరారు.ఈ రోజు తెల్లవారు జామున అలిపిరి నడకమార్గం ద్వారా అత్యంత భక్తిశ్రద్ధలతో మెట్ల మార్గంలో నడుచుకుంటూ  కొండకి చేరుకున్నారు. రష్యన్ మహిళతో పాటు క్రిస్టియన్  అయినప్పటకి క్షేత్ర సాంప్రదాయాలని  పూర్తిగా గౌరవిస్తూ ఆమె చేసిన ఈ కాలినడక ప్రయాణం అభిమానులను, భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. 

Also read: ఓ సుకుమారి ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. తిరువీర్ కెరీర్ లోనే ఫస్ట్ టైం 


తిరుమలకి చేరుకున్న అన్నాకి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సుప్రభాత సేవలో పాల్గొని  ఏడుకొండల వాడిని దర్శించుకుంది. శ్రీవారి దర్శనానంతరం క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్దకి  చేరుకుని కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన భర్త సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత బేడి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకుని ప్రత్యేక హారతి తీసుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం టీటీడీ రంగనాయకుల మండపంలో వేద పండితులు అన్నాకి  వేదాశీర్వచనం అందించగా, అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాన్ని అందజేశారు.  దర్శనానికి ముందు డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేసినట్టుగా తెలుస్తుంది. 

pawan kalyan, anna konidela, tirumala, tirupati

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.