Home  »  News  »  ఆదిత్యధర్ నెక్స్ట్ మూవీ.. ఆ ప్రాంత వీరుడి కథతోనేనా! 

Updated : Jul 18, 2026

 

 

ధురంధర్ పార్ట్ 1 , పార్ట్ 2 .. ఈ రెండు చిత్రాల పేర్లు చెప్పగానే సగటు సినీ ప్రేమికుడు సైతం ఆ చిత్రాలు సాధించిన ఘనవిజయం గురించి, రికార్డుల గురించి, గూస్ బంప్స్ సీన్స్ గురించి గుక్క తిప్పుకోకుండా చెప్తాడు.. అంతలా ధురంధర్ భారతీయ సినీ యవనిక పై జెండా పాతింది.ఇందుకు ముఖ్య కారణం ఆదిత్యధర్(Aditya Dhar)అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కలెక్షన్స్ పరంగా కూడా భారీ రికార్డుని సెట్ చేసాడు.


అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం నిర్వహించిన ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో ఒక సంచలన ప్రకటన చేశారు. అస్సాం చరిత్రలోనే అత్యంత వీరుడైన అహోం సామ్రాజ్య సైన్యాధిపతి 'లాచిత్ బోర్ఫుకన్' జీవితకథ ఆధారంగా ఒక భారీ బాలీవుడ్ చిత్రాన్ని నిర్మించాలని వారి ప్రభుత్వం యోచిస్తోందని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని  డైరెక్ట్ చేయాల్సిందిగా  స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్‌ని సంప్రదించినట్లు  అధికారికంగా వెల్లడించారు. 'ధురందర్' సిరీస్ చిత్రాలతో ఆదిత్య ధర్ తన అసాధారణ మేధస్సుని నిరూపించుకున్నారని, ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో ఆయన అత్యంత ప్రతిభావంతుడని ముఖ్యమంత్రి ప్రశంసించారు.


 లాచిత్ బోర్ఫుకన్ వంటి వీరుడి కథని  అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఆదిత్య ధర్ సరైన ఎంపిక అని అస్సాం ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.  ఈ భారీ చారిత్రాత్మక చిత్రం కోసం అస్సాం ప్రభుత్వం తన 2026-27 వార్షిక బడ్జెట్‌లోప్రత్యేకంగా నిధులని  కూడా కేటాయించింది. కేవలం లాచిత్ బోర్ఫుకన్ మాత్రమే కాకుండా, స్వాతంత్ర  సమరయోధుడు కుశాల్ కాన్వర్ పై కూడా సినిమా తెరకెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిత్య ధర్‌తో జరిపిన ప్రాథమిక చర్చలు చాలా సానుకూలంగా సాగాయి. ఈ ప్రాజెక్ట్ యొక్క క్రియేటివ్ విజన్ మరియు స్క్రిప్ట్ చర్చల కోసం ఆగస్టు నెలలో ఆదిత్య ధర్ స్వయంగా అస్సాంలో పర్యటించనున్నారు. అయితే, ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఆదిత్య ధర్  డైరెక్ట్ చేయలేకపోతే, ఇతర ప్రముఖ దర్శకులను సంప్రదిస్తామని, కానీ లాచిత్ బోర్ఫుకన్ బయోపిక్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం మాత్రం ఖాయమని సీఎం స్పష్టం చేశారు.  

also read: ఎందుకు ఇలా తెరకెక్కించారు.. ఇక మారరా!


17వ శతాబ్దానికి చెందిన  లాచిత్ బోర్ఫుకన్  అస్సాం చరిత్రలో అత్యంత శక్తివంతమైన సైనిక కమాండర్లలో ఒకరు. ముఖ్యంగా 1671లో జరిగిన చారిత్రాత్మక 'సారైఘాట్ యుద్ధంలో' మొఘల్ సామ్రాజ్య సైన్యాన్ని గజగజలాడించి, అస్సాంలోకి మొఘలులు అడుగుపెట్టకుండా అడ్డుకున్న ధీరుడు. ఆ యుద్ధ సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రణరంగంలోకి దూకి, తన సైనికుల్లో వీరోచిత స్ఫూర్తిని నింపారు. అస్సాం సంస్కృతిలో, భారత సైనిక చరిత్రలో ఆయన ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ అసాధారణ వీరుడి కథను హిందీలో భారీ కాన్వాస్‌పై తెరకెక్కించి ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు పరిచయం చేయడమే లక్ష్యంగా అస్సాం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరి 'ధురందర్'తో సంచలనాలు సృష్టించిన ఆదిత్య ధర్ ఈ చారిత్రాత్మక వీరగాథని తెరకెక్కిస్తే వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తాడో  చూడాలి.

adityadhar, lachit borphukan, himantha biswa sharma, assam, dhurandhar 2

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.