Home  »  News  »  జన నాయగన్ దెబ్బకి రిలీజ్ డేట్ మార్చుకున్న చిత్రాలు ఇవే! 

Updated : Jul 17, 2026

 

ఇళయ దళపతి విజయ్(Vijay)మరో సారి సెల్యులాయిడ్ పై తన వన్ మాన్ షో తో అభిమానులని, ప్రేక్షకులని మెస్మరైజ్ చెయ్యడానికి ఈ నెల 23 న 'జన నాయగన్'(తెలుగులో 'జననాయకుడు') తో థియేటర్స్ లో ల్యాండ్ అవుతున్న విషయం తెలిసిందే. పైగా విజయ్ కెరీర్‌లో  చివరి చిత్రం కావడంతో ఒక రేంజ్ లో హంగామా ఉంటుంది. 

 'జన నాయగన్' ధాటికి భయపడి పలు తమిళ చిత్రాలు తమ రిలీజ్ ప్లాన్స్‌ని వాయిదా వేసుకున్నాయి. ఇందులో మొదటిగా నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ నటించిన హారర్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' నిలిచింది. జూలై 23న విడుదల కావాల్సి ఉండగా సెప్టెంబర్ 4 కి వాయిదా వేశాడు. "థలపతి వస్తున్నప్పుడు మనం పక్కకి  తప్పుకోవాల్సిందే కదా" అంటూ  సోషల్ మీడియా వేదికగా విజయ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుతు పోస్ట్ కూడా చేసాడు.

Also read: భాగ్యశ్రీ బోర్సే నెక్స్ట్ సినిమాలు ఏంటో తెలుసా?

కేవలం జీవీ ప్రకాష్ మాత్రమే కాదు, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటుడిగా పరిచయమవుతున్న 'డిసి' (DC) చిత్రం కూడా వాయిదా పడింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా జూలై 31న విడుదల కావాల్సి ఉండగా, 'జన నాయగన్' హవా తగ్గడానికి సమయం పడుతుందని భావించి ఆగస్టు 7 కి వాయిదా వేశారు. అలాగే, ప్రఖ్యాత శాస్త్రవేత్త జి.డి.నాయుడు బయోపిక్‌గా తెరకెక్కిన 'జి.డి.ఎన్' (G.D.N) సినిమా కూడా జూలై 17 విడుదల నుండి వాయిదా పడింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన 'సత్యవాన్ సావిత్రి' కూడా  24న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు ఆ తేదీపై సందిగ్ధత నెలకొంది. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న 'సిగ్మా' జూలై 31న విడుదల కావాల్సి ఉంది, అయితే ఈ చిత్రం కూడా వాయిదా పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 

vijay, jana nayagan, pooja hegde, gv prakash kumar






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.