Home  »  News  »  ఇది వాళ్ళ కోసమే తీసిన సినిమా

Updated : Jul 15, 2026

 

ఆద్యంతం వినోదాన్ని పంచుతూనే, మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలని ఆవిష్కరించే కథలని  ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారు. సరిగ్గా ఇదే నమ్మకంతో, టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ హీరో, హీరోయిన్స్ గా చేసిన  అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం "మిస్టర్ మిడిల్ క్లాస్". ఎన్నో హిట్ చిత్రాలని అందించిన  జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. 

ఇటీవలే విడుదలైన టీజర్‌కి  అద్భుతమైన రెస్పాన్స్  లభిస్తుంది. యూట్యూబ్‌లో లక్షలాది వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో నిలిచిన ఈ టీజర్, సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులు, గొడవలు, కలలు, అంతర్లీనంగా ఉండే అనుబంధాలని  చాలా వినోదాత్మకంగా చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా రిలీజ్ డేట్ పోస్టర్‌లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి గెటప్‌లో కనిపించడం అనేది  నవ్వుల హంగామా ఏ రేంజ్‌లో ఉండబోతుందో చెప్పడానికి నిదర్శనం. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరో సారి ముఖ్యమైన క్యారక్టర్ పోషిస్తున్నాడు. వీరితో పాటు ప్రముఖ హాస్యనటులు సునీల్, అలీ, రఘుబాబు, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్, బాబూ మోహన్, ధనరాజ్, ప్రభాస్ శ్రీను, చిత్రమ్ శ్రీను 15 మందికి పైగా అగ్ర హాస్యనటులు కనిపించనున్నారు.


Also read: ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన రుక్మిణి వసంత్ 


 సాయి కార్తీక్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే 'గరుడవేగ' అంజి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రత్యేకమైన విజువల్స్ అందించగా, డైమండ్ రత్నబాబు, శ్రావణ్ అందించిన సంభాషణలు థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. బ్లూ జె క్రియేషన్స్ బ్యానర్‌పై జికె మరియు సిఎన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లైవ్ ప్రోగ్రామ్‌కు ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం 100% ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్‌లో కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి హాయిగా నవ్వుకోవాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.  

 

rajendraprasad, srikanth, laya, mister middile class, nageswarreddy






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.