![]() |
![]() |

తెలుగు టెలివిజన్ రంగంలో, ముఖ్యంగా డ్యాన్స్ రియాలిటీ షోలలో తనదైన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న పండు మాస్టర్.. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కష్టసమయంలో ఆయనను పరామర్శించడానికి టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్వయంగా పండు మాస్టర్ నివాసానికి వెళ్లారు. యాక్సిడెంట్ వల్ల ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న పండు మాస్టర్‌ను శేఖర్ మాస్టర్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బెడ్‌పైనే విశ్రాంతి తీసుకుంటున్న పండు మాస్టర్ దగ్గరకు వెళ్లి, ఆయన చేతులు పట్టుకుని శేఖర్ మాస్టర్ ఎంతో ధైర్యాన్ని నింపారు. శేఖర్ మాస్టర్ రాకతో పండు మాస్టర్ ముఖంలో ఎంతో సంతోషం కనిపించింది. త్వరలోనే పండు మాస్టర్ పూర్తి ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో కోలుకోవాలని, మళ్లీ ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రదర్శనలతో అలరించాలని శేఖర్ మాస్టర్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ పరామర్శకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజెన్లు సైతం పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.
Sekhar Master, Pandu Master, TeluguOne
![]() |
![]() |