![]() |
![]() |
టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశి ఖన్నా షూటింగ్ సెట్‌లో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు కంటే హిందీ, తమిళ్ ప్రాజెక్టులపైనే ఎక్కువగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ నటి విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఒక భారీ క్రేజీ ప్రాజెక్టులో రాశి ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ అనీస్ బజ్మీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ఊహించని ప్రమాదం జరిగింది.
సాధారణంగా ఫీమేల్ ఓరియెంటెడ్ స్టంట్స్ లేదా కమర్షియల్ సినిమాల్లోని యాక్షన్ సీన్ల కోసం హీరోయిన్లు డూప్‌లను వాడుతుంటారు. కానీ రాశి ఖన్నా మాత్రం సినిమాపై ఉన్న ప్యాషన్‌తో రిస్క్ తీసుకున్నారు. అనీస్ బజ్మీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం డూప్ లేకుండా స్వయంగా క్లిష్టమైన యాక్షన్ స్టంట్స్ చేయడానికి ఆమె సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సీన్ రన్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రాశి ఖన్నా స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో ఈ వార్త కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే ఇక్కడే రాశి ఖన్నా తన వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని చాటుకున్నారు. యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు అంత పెద్ద దెబ్బలు తగిలినప్పటికీ, ఆమె ఎక్కడా బ్రేక్ తీసుకోలేదు. తన వల్ల షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో, అలాగే ప్రొడ్యూసర్లకు నష్టం రాకూడదనే థాట్‌తో ఆమె పెయిన్ కిల్లర్స్ వాడుతూ గాయంతోనే ఆ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడం, దెబ్బలు తగిలినా వెనకడుగు వేయకుండా షూటింగ్ కంటిన్యూ చేయడం చూసి సెట్స్ లోని చిత్ర యూనిట్‌తో పాటు నెటిజన్లు, అభిమానులు ఆమె డెడికేషన్‌కు సెల్యూట్ చేస్తున్నారు.
Raashii Khanna, Akshay Kumar, Anees Bazmee
![]() |
![]() |