Home  »  News  »  Lenin: లెనిన్ బాక్సాఫీస్ టార్గెట్..అఖిల్ హిట్ కొట్టాలంటే అన్ని కోట్లు రాబట్టాలా?

Updated : Jul 9, 2026

 


అఖిల్ అక్కినేని రేపు 'లెనిన్'తో సెల్యులాయిడ్ పై సత్తా చాటడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. త్రీ ఇయర్స్ గ్యాప్ తర్వాత  వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ గా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్స్ ఇప్పటికే అఖిల్ కట్ అవుట్స్ తో నిండిపోవడంతో పాటు అఖిల్ నినాదాలతో మారుమోగిపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద లెనిన్ క్లీన్ హిట్ లేదా సూపర్ హిట్ హోదాని దక్కించుకోవాలంటే ఏ స్థాయిలో వసూళ్లని  రాబట్టాలనే లెక్కలపై ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 


ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అన్ని ఖర్చులు కలుపుకొని థియేట్రికల్ రన్‌లో సేఫ్ జోన్‌కు రావాలన్నా, సూపర్ హిట్ స్టేటస్ సాధించాలన్నా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లని రాబట్టాల్సి ఉంటుంది. షేర్ పరంగా చూసుకుంటే, డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చి లాభాల బాట పట్టడానికి కనీసం 25 కోట్ల రూపాయల మేర వరల్డ్‌వైడ్ షేర్ సాధించాల్సి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే థియేట్రికల్ విడుదలకు ముందే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా 34 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసి జాక్‌పాట్ కొట్టడం నిర్మాతలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.


Also read: Rashmika: రష్మిక భారీ రిస్క్..ఫ్యాన్స్ కోసం 80 అడుగుల నుంచి దూకేసింది

ఈ 34 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్‌లో డిజిటల్, శాటిలైట్ హక్కులని  ప్రముఖ సంస్థ జీ (ZEE) నెట్‌వర్క్ ఏకంగా 19 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోగా, హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా మరో 9 కోట్ల రూపాయలు వచ్చాయి. అలాగే ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ-సిరీస్ 6 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఆర్టిస్టుల పారితోషికాలు, ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషన్స్ అన్నీ కలిపి సుమారు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి విడుదలకు ముందే ఈ స్థాయి రికవరీ రావడం గమనార్హం. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు కొన్ని డబ్బింగ్ చిత్రాల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, మొదటి రోజు థియేటర్లలో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం 50 కోట్ల రూపాయల గ్రాస్ టార్గెట్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , మనం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో లెనిన్ మీ అందరకి పరిచయం కాబోతున్నాడు. 

akhil, lenin, nagarjuna, bhagyashri borse






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.