Home  »  News  »  అందుకే శ్రీలీలను పక్కన పెట్టేశాం.. నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు.!

Updated : Jul 9, 2026

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin). మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాలతో రేపు(జూలై 10) థియేటర్లలో అడుగు పెట్టనుంది. అయితే ఈ సినిమా నుంచి మొదట హీరోయిన్‌గా అనుకున్న శ్రీలీలను ఉన్నట్టుండి మార్చేసి, ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ఈ హీరోయిన్ చేంజ్‌పై సోషల్ మీడియా వేదికగా రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. శ్రీలీలకు లక్ కలిసిరావడం లేదని, అందుకే సెంటిమెంట్ పరంగా ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారంటూ కొందరు నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అఖిల్ అక్కినేని 'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఈ సినిమా చేయడంతో, ఈ హీరోయిన్ మార్పు వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని అక్కినేని అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

ఈ నేపథ్యంలో, 'లెనిన్' చిత్ర నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ హీరోయిన్ రీప్లేస్‌మెంట్ వివాదంపై, శ్రీలీలపై వస్తున్న నెగెటివ్ ట్రోల్స్‌పై స్పందిస్తూ అసలు నిజాన్ని చెప్పారు. ఒక మంచి సినిమా రూపొందే క్రమంలో కొన్నిసార్లు అన్నీ అనుకూలంగా కలిసి వస్తాయని, ఈ సినిమా టేక్ ఆఫ్ అయిన తర్వాత కూడా హీరోయిన్, కెమెరామన్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయని ఆయన అంగీకరించారు. అయితే సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా శ్రీలీల వల్ల సినిమాకు బ్యాడ్ జరుగుతుందనే పుకార్లలో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో పాపం శ్రీలీల తప్పేం లేదని, కేవలం డేట్స్ అడ్జస్ట్‌మెంట్ సమస్యల వల్లే శ్రీలీలను మార్చాల్సి వచ్చిందని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.

ఇక ఫైనల్ ప్రొడక్ట్ చూసిన తర్వాత చిత్ర యూనిట్ అంతా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నామని నిర్మాత పేర్కొన్నారు. కొన్ని సినిమాలకు మంచి జరగాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఊహించని మార్పులు సహజంగానే జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు స్క్రీన్ మీద భాగ్యశ్రీ బోర్సే పెర్ఫార్మెన్స్ చూసుకున్న తర్వాత.. అసలు ఈ పాత్రను దర్శకుడు మురళి కిషోర్ కేవలం ఆమె కోసమే రాశాడా అన్నంత అద్భుతంగా కుదిరిందని ప్రశంసించారు. భాగ్యశ్రీ ఈ సినిమాలో నటన పరంగా చాలా బాగా చేసిందని, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఒక పెద్ద అసెట్ కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. నాగవంశీ ఇచ్చిన ఈ సాలిడ్ క్లారిటీతో శ్రీలీల ఎగ్జిట్‌పై గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారాలకు పూర్తిగా తెరపడినట్లయింది.

 

 

Lenin Movie, Akhil Akkineni, Bhagyashri Borse, Naga Vamsi, Sreeleela

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.