![]() |
![]() |

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో రానున్న భారీ మైథలాజికల్ ఫిల్మ్ 'గాడ్ ఆఫ్ వార్' (God Of War) అనౌన్స్‌మెంట్ న్యూస్ తో మారుమోగిపోతోంది. ఇలాంటి సమయంలో ప్రముఖ నిర్మాత సంస్థ హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.
కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ తాజాగా సంచలన ట్వీట్ చేసింది. "కొన్ని ఆరంభాలు ఎలాంటి శబ్దం చేయవు. కానీ అవి శాశ్వతంగా నిలిచిపోయే ప్రతిధ్వనులను సృష్టిస్తాయి. తదుపరి గర్జన గుసగుసగా రాదు.. సిద్ధంగా ఉండండి. ఈరోజు మధ్యాహ్నం 2:19 గంటలకు ఆవిష్కరణ." అంటూ హోంబలే ఫిలిమ్స్ ట్వీట్ చేసింది.
ఒక వైపు 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్‌మెంట్ న్యూస్ తో మారుమోగిపోతుండగా.. ఇప్పుడు హోంబలే ఫిలిమ్స్ ట్వీట్ సంచలనంగా మారింది. ఇంతకీ హోంబలే చేయబోతున్న ఆ భారీ అనౌన్స్‌మెంట్ ఏంటనే చర్చ మొదలైంది.
హోంబలే ఫిలిమ్స్ లో ప్రభాస్ మూడు సినిమాలు కమిటై ఉన్నాడు. దీంతో ప్రభాస్ సినిమా ప్రకటన అయ్యుంటుందని కొందరు భావిస్తున్నారు. మరికొందరేమో హృతిక్ రోషన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ అంటున్నారు. మరి ఈ ఇద్దరు స్టార్స్ లో ఎవరో ఒకరి ప్రాజెక్ట్ అప్డేట్ రాబోతుందా? లేక హోంబలే ఫిలిమ్స్ మరేదైనా ఊహించని అనౌన్స్‌మెంట్ తో సర్ప్రైజ్ చేయబోతుందా? అనేది మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది.
https://x.com/hombalefilms/status/2071443288452952362
![]() |
![]() |