![]() |
![]() |

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్న భారీ మైథలాజికల్ ఫిల్మ్ 'గాడ్ ఆఫ్ వార్' (God Of War) అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రం రానుంది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీ చేస్తున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో 'గాడ్ ఆఫ్ వార్' చేయనున్నాడని వార్తలొచ్చాయి. అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించి, అనౌన్స్‌మెంట్ కి ముహూర్తం ఖరారైంది.
"ఫైనల్లీ.. నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రోజు రేపే." అంటూ నెమలి బొమ్మను జత చేసి, నిన్న నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తో 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్‌మెంట్ నేడు రానుందని క్లారిటీ వచ్చేసింది.
అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థ 'హారిక హాసిని క్రియేషన్స్' నుండి ఈ ఉదయం అదిరిపోయే ట్వీట్ వచ్చింది. ఈ రోజు సాయంత్రం 5:04 గంటలకు ఎన్టీఆర్ గారి అకౌంట్ నుండి ప్రకటన రానుందని తెలుపుతూ ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మొత్తానికి 'గాడ్ ఆఫ్ వార్' అధికారిక ప్రకటనతో సోషల్ మీడియా షేక్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.
https://x.com/haarikahassine/status/2071435996126912662
![]() |
![]() |