![]() |
![]() |

విక్టరీ వెంకటేష్. ఇది కేవలం పేరు కాదు, బ్రాండ్ అనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోకి ఎంతోమంది కుర్ర హీరోలు దూసుకొస్తున్నా, వెంకటేష్ క్రేజ్,మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు. ప్రీవియస్ చిత్రాలు 'సంక్రాంతికి వస్తున్నాం'. మన శంకర వార చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 200 కోట్ల మార్క్‌ను దాటి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో లభించిన భారీ బ్లాక్‌బస్టర్ విజయంతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకున్న తిరుగులేని క్రేజ్ మరోసారి నిరూపితమైంది. కేవలం ఒక జోనర్‌కే పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ స్టార్‌గా వెంకీమామ దూసుకుపోతున్నారు. వరుసగా స్టార్ డైరెక్టర్లు ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం వెంకటేష్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శకుటుంబం' (House No: 47) అనే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ వైవిధ్యమైన కథలో భారీ యాక్షన్ కంటే కూడా క్లీన్ కామెడీ మరియు గుండెకు హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్‌కే దర్శకుడు త్రివిక్రమ్ పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త వసూళ్ల రికార్డులను సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
త్రివిక్రమ్ సినిమాతో పాటు, హిస్టారికల్ ఫాంటసీ హిట్ 'బింబిసార'తో మెప్పించిన యంగ్ డైరెక్టర్ వశిష్టతో కూడా వెంకటేష్ ఒక కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వశిష్ట, వెంకటేష్ కోసం ఒక అద్భుతమైన స్టోరీ లైన్‌ను సిద్ధం చేశారు. ఈ కథ వెంకీమామకు బాగా నచ్చడంతో ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారని, సురేష్ ప్రొడక్షన్స్ మరియు నల్లమలుపు శ్రీనివాస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
Also read: ఇది కదా సినిమా అంటే.. 32 కోట్లు పెడితే ఏకంగా 456కోట్లు, ఓటీటీలోనూ తోపే
వీరితో పాటే, గతంలో 'వెంకీ మామ' వంటి సూపర్ హిట్ కమర్షియల్ చిత్రాన్ని అందించిన మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి సైతం వెంకటేష్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. అలాగే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్‌తో కలిసి వెంకటేష్ మరొక భారీ మల్టీస్టారర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వరుసగా త్రివిక్రమ్, వశిష్ట, బాబీ మరియు అనిల్ రావిపూడి వంటి క్రేజీ దర్శకుల లైనప్‌తో సరికొత్త జోష్‌తో వెంకటేష్ దూసుకుపోతున్న తీరు యువ హీరోలకి సైతం గట్టి పోటీనిస్తోంది.
![]() |
![]() |