![]() |
![]() |

'రాజు వెడ్స్ రాంబాయి' (Raju Weds Rambai) సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన డైరెక్టర్ సాయిలు కంపాటి (Saailu Kampati) తన తదుపరి చిత్రానికి క్లాప్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈసారి టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సుమంత్ ప్రభాస్(Sumanth Prabhas)ను లైన్లోకి దించారు. 'మేమ్ ఫేమస్', 'గోదారి గట్టుపైన' సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్, ఈ కొత్త కథకు పక్కాగా సరిపోతాడని చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతోంది. ఈ ఇద్దరు క్రేజీ టాలెంట్స్ ఒకే వేదికపైకి రావడం టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడే ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ మరియు ప్రొడక్షన్ హౌస్ ఏషియన్ సినిమాస్ నిర్మించబోతోంది. ఈ చిత్రం పూర్తి తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో సాగే ఒక సరదా ప్రేమ కథగా రూపొందనుంది. పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మధ్య ఉండే స్వచ్ఛమైన బంధాలు, లవ్, ఎమోషన్స్ మరియు సహజమైన హాస్యంతో ఈ కథను దర్శకుడు సిద్ధం చేశారట.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. అతి త్వరలోనే ఈ క్రేజీ మూవీని అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ చేయనున్నారు. ఆగస్టు నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు మేకర్స్ పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు.
ఒక వైపు డైరెక్టర్ సాయిలు కంపాటి మార్క్ మేకింగ్, మరోవైపు హీరో సుమంత్ ప్రభాస్ న్యాచురల్ యాక్టింగ్, వీటన్నింటికీ తోడు ఏషియన్ సినిమాస్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రేజీ తెలంగాణ లవ్ స్టోరీకి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
![]() |
![]() |