![]() |
![]() |

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna)వారసుడు మోక్షజ్ఞ(mokshagna)ఎంట్రీ కోసం దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తితో, ఉద్వేగంతో ఎదురుచూస్తున్నారు. ఆ మాటకొస్తే తెలుగు చిత్రసీమ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తుందని చెప్పవచ్చు. అందుకు పెద్దాయన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు(NTR)తెలుగు సినిమాకి చేసిన సేవలే ఉదాహరణ. అయితే, తాజాగా టాలీవుడ్ ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ సినీ డెబ్యూపై సస్పెన్స్ మరింత పెరిగింది. ఈ ఏడాది కూడా నందమూరి వారసుడి మొదటి సినిమా పట్టాలెక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో నందమూరి అభిమానులకు మరోసారి నిరాశే ఎదురవుతోందా అనే చర్చ జోరుగా సాగుతోంది.
'హనుమాన్' చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ ముహూర్తం సమయం వరకు అంతా సిద్దమయింది. కానీ కొన్ని అనివార్య కారణాలు, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడటం లేదా ఆగిపోవడం జరిగిందని ఇండస్ట్రీ టాక్. ఆ తర్వాత ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో, సినిమా దాదాపు ఆగిపోయిందనే ప్రచారం మరింత బలపడింది. నందమూరి మూడో తరం వారసుడిని లాంచ్ చేయడానికి టాలీవుడ్‌లోని ఎంతోమంది బడా నిర్మాతలు మరియు టాప్ బ్యానర్లు భారీ బడ్జెట్‌తో ఆసక్తి చూపిస్తున్నారు. ఎంతో మంది దర్శకులు మోక్షజ్ఞ కోసం స్క్రిప్ట్‌లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, బాలకృష్ణ మాత్రం తన కొడుకు డెబ్యూ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మొదటి సినిమానే ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్‌గా లేదా భారీ హై విజువల్ వాల్యూస్ ఉన్న కథతో ఉండాలని బాలయ్య గట్టి పట్టుదలతో ఉన్నారట. కేవలం స్టార్ హోదా ఉంది కదా అని కాకుండా, ప్రేక్షకులని వంద శాతం మెప్పించే స్క్రిప్ట్ కుదిరే వరకు ఎంత సమయమైనా వెయిట్ చేయడానికే ఆయన మొగ్గు చూపుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Also read: ఓటిటిలోకి క్రేజీ మిస్టర్ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టీవ్స్ అయితే
తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది మొత్తం కేవలం పక్కా స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులకే పరిమితం కానుంది. దర్శకుడు క్రిష్ లేదా వశిష్ట లాంటి పేర్లు కూడా ఈ రేసులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా మాత్రం ఇంకా ఏదీ ఖరారు కాలేదు. గడిచిన 5 ఏళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని బాలయ్య చెప్తున్నా, పక్కా ప్లానింగ్ కోసం ఈ ఆలస్యం జరుగుతోందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
![]() |
![]() |