![]() |
![]() |

అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin) థియేట్రికల్ రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతోంది. గతంలో వచ్చిన ‘ఏజెంట్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కావడంతో అక్కినేని అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై కొండంత ఆశలు పెట్టుకున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అయితే సినిమా విడుదల తేదీకి పట్టుమని 15 రోజులు కూడా సమయం లేదు. జూలై 10న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అటు సోషల్ మీడియాలోనూ ‘లెనిన్’ ప్రమోషన్స్ హడావుడి మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఎక్కడా సరైన సౌండ్ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఈ సినిమా మొదట మే 1న విడుదల కావాల్సింది. ఆ తర్వాత జూన్ 26కు వాయిదా వేశారు. చివరగా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) వర్క్ పెండింగ్ ఉండటం వల్ల అక్కినేని నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి జూలై 10కి రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు. అభిమానులకు 100 శాతం క్వాలిటీతో కూడిన ఒక పర్ఫెక్ట్ సినిమాను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అదనపు సమయం తీసుకున్నట్లు ప్రొడక్షన్ టీమ్ వెల్లడించింది. ప్రొడ్యూసర్ నాగార్జున సైతం ‘మనోడు జూలై 10న థియేటర్లలోకి వస్తున్నాడు, స్క్రీన్‌పై ఒక కొత్త అఖిల్‌ను చూస్తారు’ అంటూ ట్విట్టర్ వేదికగా పెద్ద స్టేట్‌మెంటే ఇచ్చారు. అయితే రిలీజ్ దగ్గరపడుతున్నా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ అవలంబిస్తున్న ‘సైలెంట్ స్ట్రాటజీ’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటిదాకా రిలీజ్ అయిన కంటెంట్ కి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆ బజ్ ను నెక్స్ట్ లో తీసుకెళ్లే ప్రమోషనల్ ఈవెంట్స్ ఏవీ ఇప్పటివరకు ప్లాన్ చేయలేదు.
సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమా వస్తోందంటే కనీసం నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ హోరెత్తించాలి. ముఖ్యంగా అఖిల్ లాంటి హీరో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన తరుణంలో ఈ రేంజ్ సైలెన్స్ సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందేమోనని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే క్రేజ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు మనం ఎంటర్‌ప్రైజెస్ లాంటి టాప్ బ్యానర్స్ తోడున్నా కూడా ప్రచారంలో జోరు తగ్గడం గమనార్హం.
ప్రస్తుతం ఉన్న తక్కువ వ్యవధిలోనే ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్స్, సిటీ టూర్స్ అంటూ భారీ ప్రమోషనల్ ప్లాన్స్ చేయకపోతే థియేటర్ల వద్ద ఓపెనింగ్స్ రాబట్టడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే కొన్ని సినిమాలు కావాలని భారీ అంచనాలను పెంచకుండా, సైలెంట్ గా వచ్చి కంటెంట్ తో సర్ ప్రైజ్ చేస్తుంటాయి. అలాంటి సినిమాలు ఓపెనింగ్స్ కంటే, లాంగ్ రన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. మరి ‘లెనిన్’ టీమ్ ఆలోచన కూడా అదేనా అనేది తెలియాల్సి ఉంది.
మరి రాబోయే వారం రోజుల్లో ‘లెనిన్’ టీమ్ ఎలాంటి కౌంటర్ ప్లాన్‌తో సౌండ్ చేస్తుందో, బాక్సాఫీస్ వద్ద అఖిల్ ఎలాంటి విద్వంసం సృష్టిస్తాడో చూడాలి.
![]() |
![]() |