Home  »  News  »  రణబాలి సెట్స్‌లో రచ్చ.. విజయ్ దేవరకొండ క్యారవాన్ వివాదం.. అసలు నిజమిదే!

Updated : Jun 26, 2026

హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ రూమర్ తెగ హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'రణబాలి' (Ranabaali) అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో విజయ్ ప్రవర్తన అస్సలు బాలేదని, ఆయన ప్రొడ్యూసర్లను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారంటూ కొన్ని ఎక్స్ (ట్విట్టర్) ఖాతాల్లో ప్రచారం మొదలైంది. 

హీరో విజయ్ దేవరకొండ షూటింగ్ లొకేషన్‌కు ఏకంగా 50 మంది అసిస్టెంట్లను తీసుకువస్తున్నారని, తనతో పాటు తన స్టాఫ్ కోసం ఏకంగా 7 క్యారవాన్లు కావాలని ప్రొడక్షన్ టీమ్‌ను తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారనేది ఆ వార్తల సారాంశం. అంతేకాదు, ఈ వ్యవహారంపై విసిగిపోయిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారంటూ కొన్ని ప్రముఖ న్యూస్ పోర్టల్స్ పేరిట సృష్టించిన ఫేక్ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అయ్యాయి.

ఈ ప్రచారం కాస్తా టాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపడంతో అసలు నిజం ఏంటో తెలుసుకోవడానికి ప్రముఖ మీడియా ప్రతినిధులు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ ని నేరుగా సంప్రదించారు. ఈ వార్తలపై రవిశంకర్ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ కథనాలన్నీ వంద శాతం అబద్ధమని, పూర్తిగా బేస్‌లెస్ వార్తలని ఆయన తేల్చిచెప్పారు. విజయ్ అత్యంత ప్రొఫెషనల్ యాక్టర్ అని, సినిమా షూటింగ్ ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతో స్మూత్‌గా సాగిపోతోందని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడి నుంచో ఇలాంటి లేనిపోని కథలు అల్లేసి నెట్టింట ప్రచారం చేయడం వెనుక ఎవరి కుట్ర ఉందో అర్థం కావడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. అసలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు వెళ్లాల్సిన అవసరమే రాలేదని, విజయ్ తమకు పూర్తి సహకారం అందిస్తున్నారని మైత్రీ సంస్థ స్పష్టం చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'రణబాలి' చిత్రం 2026 సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి హైప్ ఉన్న సినిమాపై కొందరు కావాలనే మైలేజ్ కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.