Home  »  News  »  డైరెక్ట్ తెలుగు మూవీలో ప్రదీప్ రంగనాథన్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఈల వేస్తారు

Updated : Jun 25, 2026

 


పాన్ ఇండియా అగ్ర సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers)తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep ranganathan)తో డ్యూడ్ మూవీ చేసిందంటే ప్రదీప్ స్టామినాని అర్ధం చేసుకోవచ్చు. ప్రదీప్ కూడా తన పెర్ఫార్మ్ తో సౌత్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకొని ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.


టాలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ క్రేజీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నే  నిర్మించబోతోంది. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులని  ఎంతగానో అలరించిన ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న మొదటి 'స్ట్రెయిట్ తెలుగు సినిమా' (Straight Telugu Debut) ఇదే కావడం విశేషం.

ప్రదీప్ రంగనాథన్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రైటర్‌గా తన ప్రతిభను నిరూపించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించిన వసూళ్ల సునామీ అంతా ఇంతా కాదు. 'లవ్ టుడే' (Love Today), 'డ్రాగన్' (Dragon), మరియు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనే వచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ. 114 కోట్లకు పైగా వసూలు చేసిన 'డ్యూడ్' (Dude) చిత్రాలతో వరుసగా మూడు సార్లు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి తిరుగులేని హిట్స్ అందుకున్నారు. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ మూడు బ్యాక్-టు-బ్యాక్ రూ. 100 కోట్ల మైలురాళ్ళు ప్రదీప్‌ను సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యాంకబుల్ యంగ్ స్టార్‌గా నిలబెట్టాయి. ఇప్పుడు అదే జోష్‌తో తెలుగు మార్కెట్ పై కన్నేసిన ఈ యంగ్ హీరో, చంద్రశేఖర్ యేలేటి లాంటి కల్ట్ డైరెక్టర్‌తో చేతులు కలపడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

చంద్రశేఖర్ యేలేటి అంటేనే తెలుగు సినిమాలో ఒక ప్రత్యేకమైన బ్రాండ్. 'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు', 'సాహసం', 'మనమంతా' వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మైండ్ గేమ్‌లు, విభిన్నమైన సస్పెన్స్ స్క్రీన్‌ప్లేలకు ఆయన పెట్టింది పేరు. కమర్షియల్ హంగులకు దూరంగా ఉంటూనే ప్రేక్షకులను థ్రిల్ చేసే యేలేటి మార్క్ సరికొత్త స్క్రిప్ట్‌కు, ప్రదీప్ రంగనాథన్ మార్క్ యూత్‌ఫుల్ ఎనర్జీ మరియు కామెడీ టైమింగ్ తోడైతే థియేటర్లలో వినోదాల విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడానికే మెగా క్రేజీగా ఉంది. ఈ చిత్రం ఒక హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపుదిద్దుకోబోతున్నట్లు సమాచారం.

Also read: Og 2: ఓజి 2 లో ఉండబోయే కథ ఇదే  


ఈ భారీ ప్రాజెక్ట్‌కి  సంబంధించిన కథా చర్చలు, ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులు పూర్తిగా లాక్ అయ్యాయని, మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇద్దరు విలక్షణ ప్రతిభావంతులను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకురావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కానుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ ఎనర్జీ, చంద్రశేఖర్ యేలేటి ఇంటెలిజెన్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు.. ఈ ముగ్గురి కలయిక బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.