Home  »  News  »  Og 2: ఓజి 2 లో ఉండబోయే కథ ఇదే  

Updated : Jun 25, 2026

 

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'OG' (og)సృష్టించిన  సంచలనం  తెలిసిందే. ఎంటైర్ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు 300 కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. ఈ భారీ విజయంతో పవర్ స్టార్ అభిమానుల్లో పూనకాలు తెప్పించిన దర్శకుడు సుజీత్, ఇప్పుడు అంతకు మించిన విధ్వంసానికి తెరలేపారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలకి  తెరదించుతూ ఈ రోజు  ‘OG 2’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ హై ఎనర్జీ వీడియోని  విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో టాలీవుడ్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి.

"తుఫాను రావడానికి ముందు.. అక్కడ కొంత నిశ్శబ్దం ఉంటుంది. ఓజాస్ గంభీర యొక్క అన్‌టోల్డ్ స్టోరీ ఇప్పుడు విప్పబడటానికి సిద్ధంగా ఉంది" అంటూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ వేదికగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాని  షేక్ చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని పవన్ కళ్యాణ్ స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పతాకంపై నిర్మిస్తుండటం గమనార్హం. ఈ ప్రత్యేక వీడియోలో దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్‌కు ‘OG 2’ స్క్రిప్ట్ లైన్ మరియు సరికొత్త ‘OG Universe’ ఐడియాలను వివరిస్తూ కనిపించారు. సుజీత్ చెప్తున్న పవర్‌ఫుల్ సీక్వెన్స్‌లని పవన్ ఎంతో ఆసక్తితో వింటూ ప్రశ్నలు అడుగుతూ, చర్చల్లో మునిగిపోయారు.

ఈ వీడియో చివర్లో పవన్ కళ్యాణ్ దర్శకుడితో మాట్లాడుతూ "నా వైపు నుండి నువ్వు ఏం కోరుకున్నా నేను రెడీగా ఉన్నాను (Whatever from my side will be ready)" అని చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అంతేకాదు, సుజీత్ రాసుకున్న ఒక నిర్దిష్ట సీన్‌ని  విన్న పవన్.. అది వెండితెరపై ఒక ఐకానిక్ విజువల్‌గా నిలిచిపోతుందని ప్రశంసించారు. ఈ సీక్వెల్‌లో కథ కేవలం పార్ట్ 2 కి మాత్రమే పరిమితం కాకుండా, ఒక భారీ ‘OG సినిమాటిక్ యూనివర్స్’గా విస్తరించబోతోందని స్పష్టమైంది. ఈ చిత్రంలో మంచు క్రమంగా రక్తంగా మారే ఒక అద్భుతమైన సీన్‌తో పాటు, ఒక రహస్యమైన ‘అవుట్‌సైడర్’ పాత్ర మరియు ఓజీ పెట్ (పెంపుడు జంతువు) ప్రాధాన్యత గురించి సుజీత్ ప్రత్యేకంగా వివరించారు.

సినిమా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘OG 2’ చిత్రం కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, ఓజాస్ గంభీర గతానికి సంబంధించిన ఒక ఇంటెన్స్ ప్రీక్వెల్ బ్యాక్‌డ్రాప్‌ని  కూడా కలిగి ఉండబోతోంది. ముఖ్యంగా జపాన్ నేపథ్యంలో గంభీర సృష్టించిన అసలు రక్తాక్షరాల విద్వంసం ఏమిటి? అతను ముంబై అండర్‌వరల్డ్‌ను శాసించే అంత పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? అనే కోణాల్లో ఈ కథ నడవనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా తన రాజకీయ బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రానికి కాల్షీట్లు సర్దుబాటు చేయనున్నారు. నవంబర్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.