Home  »  News  »  Mythri Movie Makers: మైత్రి మూవీస్ నుంచి మరో క్రేజీ మూవీ.. రాజా ది రాజా రిలీజ్ ఎప్పుడంటే

Updated : Jun 23, 2026

 


బ్యానర్ ని చూసి సినిమాకి వెళ్లే రోజులని మళ్ళీ చిత్ర సీమకి కల్పించిన సంస్థ మైత్రి మూవీ మేకర్స్. బ్యానర్ కి ప్రత్యేకించి అభిమానులు కూడా ఏర్పడ్డారంటే మైత్రి సృష్టిస్తున్న ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీలకి ఎప్పుడు  ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా యువతని  ఆకట్టుకునే యూత్‌ఫుల్ కంటెంట్ ఉంటే థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతుంటాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే తన వైబ్రెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో సినీ ప్రియులలో సరికొత్త ఆసక్తిని రేకెత్తించిన చిత్రం 'రాజా ది రాజా'. రుత్విక్ మరియు విశాఖ ధీమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గ్రాండ్ జూలై 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. 

 'మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్' ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముందుకు రావడంతో  'రాజా ది రాజా'కి ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ రావడమే కాకుండా అత్యధిక థియేటర్స్ లో సందడి చేయనుంది. ఒక చిన్న సినిమాకి ఇది ఎంత ప్లస్ నో అర్ధం చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా సినిమా ఓపెనింగ్స్‌పై భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 

Also read: Pawan kalyan vs vijay: పవన్ కి విజయ్ థాంక్స్ ఎందుకు చెప్పలేదు!

తాజాగా విడుదలైన రిలీజ్ డేట్ పోస్టర్ ప్రేక్షకులని  విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో హీరో రుత్విక్, హీరోయిన్ విశాఖ ధీమన్ మధ్య ఉన్న అదిరిపోయే కెమిస్ట్రీని, వారి సరదా ప్రయాణాన్ని అద్భుతంగా హైలైట్ చేశారు. కలర్ ఫుల్ విజువల్స్, అత్యంత ఆకర్షణీయమైన డిజైన్స్ ఈ చిత్రంలోని రొమాంటిక్ మూడ్‌ను పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేస్తున్నాయి. లీడ్ పెయిర్ ఇద్దరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ యూత్‌ను అమితంగా ఆకర్షిస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన 'ఫస్ట్ సింగిల్' యూట్యూబ్‌లో మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో చార్ట్‌బస్టర్‌గా నిలిచి, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాట సినిమాపై అంచనాలని వంద రెట్లు పెంచేసింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.