![]() |
![]() |

'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi)కుటుంబానికి సంబంధించి బీహార్లోని ఆయన స్వగ్రామంలో జరిగిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పంకజ్ త్రిపాఠి అన్నయ్య విజయేంద్రనాథ్ తివారీపై కొంతమంది దుండగులు గొడ్డలితో ఘోరంగా దాడికి తెగబడ్డారు. నిన్న ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకి దారితీసింది.
పంకజ్ త్రిపాఠి కుటుంబ సభ్యులు సినిమా రంగానికి పూర్తి దూరంగా ఉంటూ, తమ సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటిది, పంకజ్ త్రిపాఠి అన్నయ్యపై ఇలాంటి ప్రాణాంతక దాడి జరగడం బాలీవుడ్ వర్గాలతో పాటు సాధారణ ప్రజలని సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోరమైన ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా, మాధోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్సంద్ తివారీ టోలా అనే గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ దాడి వెనుక చాలా కాలంగా నలుగుతున్న ఒక భూ వివాదమే ప్రధాన కారణమని తెలుస్తోంది. జూన్ 21న విజయేంద్రనాథ్ తివారీకి, వారి పొరుగున ఉండే రాజేష్ సాహ్ అనే వ్యక్తికి మధ్య భూమికి సంబంధించిన ఒక విషయంలో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి, వివాదం కాస్తా తీవ్ర హింసాత్మకంగా మారింది. దీంతో పంకజ్ త్రిపాఠి సోదరుడిపై రాజేష్ గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఊహించని దాడిలో విజయేంద్రనాథ్ తివారీ శరీరానికి తీవ్రమైన గాయాలయ్యాయి.
Also read: నేటివిటీ వదిలేస్తున్న తెలుగుసినిమా.. ఇది వీళ్ళ పనేనా!
దాడి జరిగిన వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన విజయేంద్రనాథ్ని అత్యవసరంగా గోపాల్గంజ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, గాయాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో మెరుగైన, అధునాతన వైద్య చికిత్స కోసం పాట్నాలోని పి.ఎమ్.సి.హెచ్ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఏప్రిల్ 2024 లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో పంకజ్ త్రిపాఠి బావ రాకేశ్ తివారీ మరణించగా, సోదరి సబితా తివారీ తీవ్రంగా గాయపడ్డారు. ఆ చేదు జ్ఞాపకాల నుండి కోలుకోకముందే, ఇప్పుడు సొంత అన్నయ్యపై ఇలా గొడ్డలితో దాడి జరగడం పంకజ్ త్రిపాఠి కుటుంబాన్ని తీవ్ర ఆవేదనలోకి నెట్టింది.
![]() |
![]() |