![]() |
![]() |

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram pothineni).. సిల్వర్ స్క్రీన్ పై రెండు దశాబ్దాల నుంచి తనదైన ఎనర్జీ తో దూసుకుపోతున్నాడు. భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హిట్ ఇంకా పలకరించకపోయినా వరుస క్రేజీ ఆఫర్స్ తో టాలీవుడ్ కి కాబోయే నెంబర్ వన్ హీరోయిన్ అనే టాగ్ లైన్ తో దూసుకుపోతూ ఉంది. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాకి అదనపు ఆకర్షణగా నిలిచి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ వైరల్ స్థాయి తాజాగా భాగ్యశ్రీ బోర్సే మాటలతో మరింత పెరిగింది.
ఇటీవల తన తాజా చిత్రం ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ టాక్ షోలో భాగ్యశ్రీ మాట్లాడుతు నా మొదటి ఇల్లు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అయితే, హైదరాబాద్ నా రెండో ఇల్లు. అది ఇప్పటికే ఫిక్స్ అయిపోయిందనే వ్యాఖ్యలు చేసింది. ఈ మాటలని ఆధారంగా చేసుకుని పలువురు నెటిజన్లు, అభిమానులు భాగ్యశ్రీ త్వరలో తెలుగింటి కోడలిగా మారబోతుందా? అనే సందేహాలని వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు అయితే రామ్‌తో ఆమె సంబంధం నిజమేనని సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారు. అయితే గతంలో ఈ ప్రేమ వార్తలపై రామ్ పోతినేని ఇప్పటికే స్పందించారు. తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.. రామ్, భాగ్యశ్రీ కలిసి 'ఆంధ్రాకింగ్’ చిత్రంలో జంటగా చేసారు.
ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, షూటింగ్ సమయంలోనే రామ్, భాగ్యశ్రీ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని ఆ స్నేహమే క్రమంగా ప్రేమగా మారిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్ పరంగా చూసుకుంటే అఖిల్ తో చేస్తున్న లెనిన్ తో భాగశ్రీ జులై 10 న థియేటర్స్ లో సందడి చేయనుంది. రామ్ తన కొత్త మూవీని స్టార్ చేసాడు. దర్శకుడు కూడా రామ్ నే .
![]() |
![]() |