Home  »  News  »  ఫ్యామిలీ ఆఫర్ ప్రకటించిన సింగ్ గీతం టీం.. టికెట్ ధరలు ఎంత తగ్గాయో తెలుసా!

Updated : Jun 21, 2026

 


విభిన్న కథ, కథనంతో కూడిన చిత్రాల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeetham Srinivasa Rao)తన మార్క్ మాయాజాలంతో 'సింగ్ గీతం' (sing geetham)అనే మూవీతో థియేటర్స్ లో తిష్ట వేసిన విషయం తెలిసిందే. కల్కి దర్శకుడు  నాగ్ అశ్విన్ నిర్మాణ భాగస్వామ్యంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో  తెరకెక్కగా ప్రేక్షకులకి  సరికొత్త అనుభూతికి గురి చేస్తుంది

థియేటర్లలో లభిస్తున్న అద్భుతమైన రెస్పాన్స్, పాజిటివ్ టాక్ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రేక్షకులకి  ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ముఖ్యంగా సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ మ్యూజికల్ విజువల్ వండర్‌ని  థియేటర్లలో చూసి ఆనందించాలనే ఉద్దేశంతో తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలని  భారీగా తగ్గించారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో  200 గా ఉన్న సినిమా టికెట్ ధరని 175 కి తగ్గిస్తూ  అధికారిక ప్రకటన విడుదల చేశారు. 

Also read: Mouneesha chowdary: మూవీ ఆఫర్ చేసి బాడీ కొలతలు అడిగాడు.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ భాగోతం  

ఈ క్రేజీ ప్రాజెకి  టాలీవుడ్ నుండి కూడా ఊహించని స్థాయిలో సపోర్ట్ లభిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించగా, తాజాగా గ్లోబల్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్  తన పూర్తి సపోర్ట్ అందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేశారు. ప్రభాస్ ఇచ్చిన ఈ పాజిటివ్ ఎండార్స్‌మెంట్ మరియు తాజాగా ప్రకటించిన టికెట్ ధరల తగ్గింపు ఆఫర్ ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని  థియేటర్ల వైపు పరుగులు పెట్టించేలా చేస్తోంది. అయాన్ ఖాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి కీ రోల్స్ పోషించగా దేవిశ్రీప్రసాద్ దర్శకుడు.



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.