Home  »  News  »  Mouneesha chowdary: మూవీ ఆఫర్ చేసి బాడీ కొలతలు అడిగాడు.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ భాగోతం  

Updated : Jun 21, 2026

 

సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో అమ్మాయిలను లోబరుచుకునేందుకు, కొందరు ప్రయత్నిస్తారనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. ఇండస్ట్రీలో ఉండే ఈ చీకటి కోణాన్ని, కాస్టింగ్ కౌచ్ చేదు అనుభవాలను ఇప్పటికే పలువురు యంగ్ హీరోయిన్లు, నటీమణులు ధైర్యంగా బయటపెట్టారు. ఇప్పుడు ఇదే బాటలో మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మౌనీషా చౌదరి(Mouneesha chowdary) టాలీవుడ్‌లో తనకు ఎదురైన ఒక షాకింగ్ అనుభవాన్ని పంచుకుని సంచలనం సృష్టించింది.

అమెరికాలో నివసిస్తూ మోడలింగ్‌ రంగంలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా చౌదరి, రీసెంట్‌గా ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన టాక్ షోలో ఆమె పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత విషయాలతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా హోస్ట్ ఆమెను ప్రశ్నిస్తూ, "మీకు తెలుగులో సినిమా ఆఫర్స్ వచ్చాయా?" అని అడిగారు. దానికి మౌనీషా సమాధానమిస్తూ ఆఫర్లు వచ్చిన మాట నిజమే. కానీ కొన్ని చేదు కారణాల వల్ల తిరస్కరించాను. ఒక దర్శకుడు సినిమా ఆఫర్ ఇస్తానని చెప్పి, ఆడిషన్స్ పేరుతో శరీర కొలతలు అడిగాడు. అసలు ఒక నటిగా ప్రతిభని నిరూపించుకోవడానికి నటన వచ్చా రాదా అని అడగాలి కానీ, బాడీ  కొలతలు అడగడం ఏంటి? నటన రాకపోతే నేరుగా ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోమనాలి తప్ప ఇలాంటి డిమాండ్లు చేయడం కరెక్ట్ కాదు. ఆ చేదు అనుభవం మిగిల్చిన భయంతోనే సినిమాలకి  దూరంగా ఉన్నాను.


Also read: Toxic: టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారకంగా ప్రకటించిన యష్ 


నన్ను కొలతలు అడిగిన వ్యక్తి, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక పెద్ద స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో వందల కోట్ల బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడని పేర్కొనడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్‌సేన్‌ కొత్త సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మౌనీషాను సంప్రదించారట. కానీ పాత భయాల వల్లే తాను ఆ క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా నో చెప్పానని మౌనీషా చౌదరి స్పష్టం చేసింది.  

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.