Home  »  News  »  Nandamuri mokshagna: నందమూరి మోక్షజ్ఞకి యాక్టింగ్‌ ఇంట్రస్ట్‌ లేదా? అసలు నిజం ఇదే!

Updated : Jun 21, 2026

 

 

తెలుగు సినిమా చరిత్రలో నందమూరి బ్రాండ్ కి ఉన్న పవర్ తెలిసిందే.  పెద్దాయన ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ దాకా తమ హవా చాటుతూ వస్తున్నారు. తెలుగు సినిమా ఎదుగుదలకి కూడా ముఖ్య కారకాలు. దీంతో నందమూరికి చెందిన ప్రతి తరం తెలుగు సినిమాని ఏలుతూ ఉండాలని అభిమానులు, మూవీ లవర్స్ కోరుతూ వస్తున్నారు.  

కానీ గత కొన్నేళ్లుగా వాళ్ళందర్నీ ఒకే ఒక ప్రశ్న వేధిస్తోంది. బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు అని? సాధారణంగా ఇండస్ట్రీలోని స్టార్ హీరోల వారసులు 25 ఏళ్ల వయసు వచ్చేసరికే హీరోలుగా ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటారు. కానీ మోక్షజ్ఞ విషయానికి వస్తే కథ పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 6వ తేదీన ఆయన 30వ పుట్టినరోజు జరుపుకుని, ప్రస్తుతం 31వ పడిలోకి అడుగుపెట్టారు. అయినా కూడా ఇప్పటివరకు ఆయన  సినిమా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో అసలు మోక్షజ్ఞకు యాక్టింగ్ పట్ల ఆసక్తి ఉందా లేదా అనే  అనుమానాలు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ వర్గాల్లో ఒక్కసారిగా రేకెత్తాయి. 

ఈ సుదీర్ఘ నిరీక్షణకు మరింత ఆజ్యం పోస్తూ గతంలో జరిగిన కొన్ని పరిణామాలు అభిమానులని  కలవరపెడుతున్నాయి. 'హనుమాన్' మూవీతో 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టిoచిన  ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ లాంచ్ కాబోతున్నట్లు గతంలో అధికారికంగా ప్రకటించారు. 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' లో భాగంగా ఒక క్రేజీ మైథలాజికల్ ఫాంటసీ కథతో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ ప్రారంభం కావాల్సిన సమయంలో ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పరమైన మార్పులు లేదా క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా దాదాపు ఏడాది కాలంగా  పక్కన పడిపోయింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కావాల్సిన ఈ మూవీ వాయిదా పడటంతో, అసలు ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందా లేక మోక్షజ్ఞకు సినిమాలంటేనే ఇంట్రెస్ట్ లేదా అనే రూమర్స్  వైరల్ అవుతున్నాయి.

Also read: ప్రముఖ అగ్ర నిర్మాత కన్నుమూత

అయితే ఈ ఆలస్యం వెనుక అసలు నిజం మోక్షజ్ఞకు ఆసక్తి లేకపోవడం కాదు, సరైన పక్కా స్క్రిప్ట్ కోసం జరుగుతున్న వెతుకులాట మాత్రమే అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. పెద్దాయన ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి ఇద్దరు లెజెండ్రీ నటుల వారసత్వాన్ని మోయడం అంటే సామాన్యమైన విషయం కాదు. దాదాపు మూడు తరాల అభిమానుల అంచనాలను అందుకోవాల్సి ఉంటుంది. అందుకే నందమూరి కుటుంబం ఎక్కడా తొందరపడకుండా అడుగులు వేస్తోంది. ఆ మధ్య నారా రోహిత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోక్షుకి ఒక మంచి లవ్ స్టోరీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఉందని హింట్ ఇచ్చారు. మరోవైపు బాలయ్య కూడా తన క్లాసిక్ హిట్ 'ఆదిత్య 369' కి సీక్వెల్ గా రాబోతున్న 'ఆదిత్య 999 మ్యాక్స్' ద్వారా తానే స్వయంగా మోక్షుని పరిచయం చేస్తానని హింట్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పై దర్శకుడు క్రిష్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నిన్న జూన్ 20న మోక్షజ్ఞ తిరుమల శ్రీవారిని దర్శించుకుని విఐపి విరామ సమయంలో ప్రత్యేక పూజలు చేయడం చూస్తుంటే, ఆయన సినీ ఎంట్రీ ముహూర్తం చాలా దగ్గరలోనే ఉందని మరియు త్వరలోనే ఒక సాలిడ్ అఫీషియల్ అప్డేట్ తో నందమూరి సింహం టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతుందని స్పష్టమవుతోంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.