Home  »  News  »  Maa Inti Bangaram: మా ఇంటి బంగారం ట్విట్టర్ రివ్యూ 

Updated : Jun 19, 2026

 

 

స్టార్ హీరోయిన్ సమంత ఈ రోజు వరల్డ్ వైడ్ గా 'మా ఇంటి బంగారం' తో థియేటర్స్ లో తన సత్తా చాటడానికి ల్యాండ్ అయ్యింది. 'ఓ బేబీ' వంటి సూపర్ హిట్ తర్వాత సమంత, ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఉదయం నుంచే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ట్విట్టర్  వేదికగా వస్తున్న టాక్ ప్రకారం సమంత అభిమానులని, ఫ్యామిలీ ఆడియన్స్‌ని  ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.


ట్విట్టర్ యూజర్ల అభిప్రాయం ప్రకారం, ఈ సినిమా కంప్లీట్ వన్-ఉమెన్ షోగా నిలిచింది. సమంత తన నటనతో మూవీ మొత్తాన్ని  తన భుజాలపై మోసిందని నెటిజన్లు కొనియాడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ ,క్లైమాక్స్ లో వచ్చే చివరి 30 నిమిషాల రివెంజ్ యాక్షన్ సీన్స్ థియేటర్లలో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయని, సమంత "లేడీ సూపర్ స్టార్" అనే ట్యాగ్‌కి  పూర్తి న్యాయం చేసిందని అభిమానులు కామెంట్లు చేషున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది 3/5 రేటింగ్ ఇస్తూ, ఈ వేసవి కాలానికి ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ప్రశంసిస్తున్నారు.


Also read: Vanda Devullu Movie Review In Telugu: వంద దేవుళ్ళు మూవీ రివ్యూ

అయితే, మరోవైపు  కొన్ని మిశ్రమ స్పందనలు కూడా వస్తున్నాయి. కథాంశం చాలా పాతదిగా ఊహించదగినదిగా ఉందనేది కొంతమంది నెటిజన్ల వాదన. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కథ చాలా ఫ్లాట్‌గా సాగిందని, విలన్ ట్రాక్ బలంగా లేకపోవడం వల్ల కధనంలో  బిగువు లోపించిందని కొందరు అంటున్నారు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  కొన్ని యాక్షన్ సీన్స్ ని బాగానే ఎలివేట్ చేసినప్పటికీ, కొన్ని కీలకమైన ఎమోషనల్ సీన్స్ లో ఆశించిన స్థాయి ఇంపాక్ట్ చూపించలేకపోయిందని రేటింగ్స్ 2.25/5 కి పరిమితం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.